Cinnamon
-
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల
Cinnamon- Health Benefits In Telugu: దాల్చినచెక్క.. భారతీయుల వంట గదిలో కనిపించే సుగంధ ద్రవ్యాల్లో ముందు వరుసలో ఉంటుంది. నిజానికి మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. అయితే, కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఔషధపరంగానూ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు.. ఇతరత్రా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు దీని పొడిని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని న్యూట్రీషనిస్ట్ లోవనీత్ బాత్రా ఎన్డీటీవీతో పేర్కొన్నారు. దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►మహిళల్లో రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ►ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ►ఇందులోని యాంటీ- ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మంట, వాపులను తగ్గించేందుకు దోహదపడతాయి. ►దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో తోడ్పడుతుంది. ►అదే విధంగా దగ్గు, పంటినొప్పులను తగ్గించడంలో దోహదపడుతుంది. ►గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు తదితర సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే ఉపశమనం పొందవచ్చు. ►ఫుడ్‌పాయిజన్ అయిన సందర్భాల్లో దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ►నిద్రలేమి సమస్యతో బాధపడే వారు.. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించాలి. దీనిలో తేనె కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాల్చిన చెక్క సువాసన, రంగుకు కారణమైన సినామాల్డెహైడ్ అనే రసాయనం హైపోగ్లైసెమిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. కాబట్టి షుగర్ పేషంట్లు దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే(చక్కెర లేకుండా) తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక సినామాల్డెహైడ్ యాంటీ ఫంగల్ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల నివారణకు దోహదం చేస్తుంది. అదే విధంగా రక్తనాళాలు మూసుకుపోకుండా చేస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. Health: తొడల మీద దద్దుర్లు.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలివే! కారణాలేంటి? రిస్క్ ఎవరికి ఎక్కువ? -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
కొవ్వు కరిగించాలా...
ఊబకాయంతో పాటు మధుమేహానికి కూడా దాల్చిన చెక్క విరుగుడుగా పని చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మిషిగన్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దాల్చిన చెక్కలోని సినమాల్డీహైడ్ అనే పదార్థం రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గిస్తుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కారణాలేమిటన్నది మాత్రం జున్ వూ నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం నిర్ధారించింది. ఈ పదార్థం జీవక్రియలపై ప్రభావం చూపడం ద్వారా సినిమాల్డీహైడ్ ఊబకాయం, మధుమేహాలపై పనిచేస్తుందని జున్ తెలిపారు. వేర్వేరు వర్గాలు, వయసు, బాడీమాస్ ఇండెక్స్ ఉన్న వ్యక్తుల అడిపోసైట్స్ (కొవ్వులను నిల్వ చేసుకునే కణాలు) లపై తాము పరిశోధనలు జరిపామని సినిమాల్డీహైడ్ను ప్రయోగించినప్పుడు ఈకణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైమ్‌లు ఎక్కువగా పనిచేయడం మొదలైందని.. ఇవన్నీ శరీరంలోని లిపిడ్స్‌ను తగ్గించేవని తాము గుర్తించామని జున్ తెలిపారు. మన పూర్వీకులకు కొవ్వు పదార్థాలు పెద్దగా అందుబాటులో ఉండేవి కాదని.. ఆ పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో శరీరానికి కావల్సిన శక్తిని అందించేందుకు అడిపోసైట్స్ కొవ్వులను నిల్వ చేసుకునేవని.. పరిణామ క్రమంలో శరీరంలోకి చేరుతున్న అధిక కొవ్వులను ఇవి నిల్వ చేసుకుంటున్నాయని జున్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకాయం సమస్య పరిష్కారానికి శరీరంలోని కణాలు స్వయంగా కొవ్వులను కరిగించేలా చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో జున్‌కు దాల్చిన చెక్క మంచి లక్షణాల గురించి తెలిసింది. దాల్చిన చెక్కను ఇప్పటికే అనేక రకాల ఆహారాల్లో వాడుతున్న నేపథ్యంలో మధుమేహులు, ఊబకాయులు ఈ ఆహారం ద్వారానే తమ సమస్యలను తగ్గించుకునే అవకాశముందని చెప్పారు. -
మధుమేహాన్ని హరించే చెక్క
గుడ్‌ఫుడ్ దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది. దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్డిఎల్)కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) వంటి క్యాన్సర్ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్‌లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు. రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్ కూడా. రోజూ ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి చిటికెడు వేసి మరిగించి కొద్దిగా తాగవచ్చు. రుచికి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. -
చెక్కతో డయాబెటిస్‌కు చెక్
గుడ్‌ఫుడ్ దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది.దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్డిఎల్) కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) వంటి క్యాన్సర్ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్ కూడా. -
దాల్చినచెక్క (Cinnamon)
తిండి గోల దాల్చినచెక్క పేరు వినగానే ఘుమఘుమలాడే బిర్యానీ గుర్తుకు వస్తుంది ఎవరికైనా. మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. సంస్కృతంలో దీనిని త్వక్ అని దారుసితా అనీ అంటారు. భారతదేశంలో ఇది చాలా ప్రాచీనకాలంగా ఉన్నప్పటికీ, అరబ్బుల మూలంగానే మనదేశంలోకి వచ్చింది. ఇది తేజవత్ అనే ఒక చెట్టు పట్ట. దానిని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి విక్రయిస్తారు. మొదట్లో దీనిని మాంసాన్ని నిల్వచేయడానికి ఉపయోగించేవారట. తర్వాత్తర్వాత మాంసాహార వంటకాలలోనూ, ఆ తర్వాత శాకాహార వంటకాలలోనూ ఉపయోగించడం మొదలెట్టారు. ఔషధపరంగా దీని ఉపయోగాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నోటిదుర్వాసన, దగ్గు, పంటినొప్పులను తగ్గించడానికి ఇది పెట్టింది పేరు. స్వరపేటిక వాపు, గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు వంటి వ్యాధులు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే నివారణ జరుగుతుంది. కల్తీ తినుబండారాల వల్ల తిన్న ఆహారం విషమై, అస్వస్థతకు లోనయినప్పుడు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తారు. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించి, తేనెతో కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. -
పెరిగే వయసును ఆపేసే దాల్చిన చెక్క...
న్యూ ఫేస్ వంటకాలలో వాడే దాల్చిన చెక్కలో చర్మకాంతిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని సౌందర్య ఉత్పాదనలలో తప్పనిసరిగా వాడుతుంటారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వదు. అమితంగా ఉండే మినరల్స్, విటమిన్ల వల్ల చర్మం సహజకాంతిని కోల్పోదు. దీంతో ఎక్కువ కాలం యవ్వనకాంతితో వెలిగిపోతారు. ఆహారంలోనూ దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉండాలి. జిడ్డు, కాంబినేషన్ చర్మం గలవారికి దాల్చినచెక్క ప్యాక్ మహత్తరంగా పనిచేస్తుంది. కావల్సినవి: * టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి * రెండు టేబుల్ స్పూన్ల తేనె తయారీ: * దాల్చిన చెక్క, తేనె కలపాలి. మృదువైన మిశ్రమం తయారుచేయాలి. * ముఖాన్ని శుభ్రపరుచుకుని తడి లేకుండా తుడవాలి. తర్వాత దాల్చిన చెక్క మిశ్రమాన్ని కళ్ల చుట్టూతా వదిలేసి ముఖమంతా రాయాలి. * అలాగే గొంతు, మెడకు కూడా పట్టించాలి. * కనీసం 15 నిమిషాల సేపు ఆరనివ్వాలి. దీంతో దాల్చిన చెక్క, తేనెలోని పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. * తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద చిలకరించి, మృదువుగా మర్దనా చేస్తూ, కడిగేయాలి. * తర్వాత చల్లని నీటితో కడిగి, మెత్తని టవల్‌తో తుడవాలి. * మీ ముఖ చర్మం మృదువుగా కనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మ కాంతి పెరగుతుంది. * ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎండకు కందిపోయిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మచ్చలు, యాక్నె సమస్యలు తగ్గుతాయి. -
దాల్చినచెక్కతో మధుమేహం నియంత్రణ!
న్యూయార్క్: వంటగదిలో అతి సాధారణ దినుసు అయిన దాల్చినచెక్క మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందట. టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. త ర్వాత ఫలితాలను పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చినచెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే టైప్2 మధుమేహ రోగులకు కచ్చితంగా ఎంత మోతాదు దాల్చినచెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.