చెక్కతో డయాబెటిస్‌కు చెక్‌ | Check for diabetes with wood | Sakshi
Sakshi News home page

చెక్కతో డయాబెటిస్‌కు చెక్‌

Published Wed, Jun 14 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

చెక్కతో డయాబెటిస్‌కు చెక్‌

చెక్కతో డయాబెటిస్‌కు చెక్‌

గుడ్‌ఫుడ్‌

దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ (టైప్‌ 2 డయాబెటిస్‌) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది.దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్‌ తీసుకుంటే  గుండెకు హాని చేసే (ఎల్‌డిఎల్‌) కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది.

ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్‌) వంటి క్యాన్సర్‌ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌ కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement