
ఈ కాలం అమ్మాయిలను వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య "బెల్లీ ఫ్యాట్". దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే పైసా ఖర్చు లేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన "పవనముక్తాసనం" వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు.
ఎలా వేయాలి?
► ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి.
► దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి.
► మోకాళ్లను రెండు చేతులతో పట్టుకుని చాతీ వరకు తీసుకురావాలి. మోకాలితో పొట్టను అదుముతూ శ్వాసను వదులుతూ చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి.
► ఈ స్థితిలో కొద్దిసేపటి వరకు ఉంటూ గాఢ ఉఛ్వాస, నిఛ్వాసలను తీసుకోవాలి.
► అనంతరం తిరిగి యధాస్థితికి వచ్చేయాలి.
► దీన్ని రెండు, మూడు సార్లు చేయాలి.
ఉపయోగాలు:
⇒ కండరాలను బలపర్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.
⇒ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
⇒ పేగులు, ఇతర ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది.
⇒ కీళ్లలో రక్తప్రసరణను మెరుగుపర్చుతుంది.
⇒ అధిక బరువును తగ్గిస్తుంది.
⇒ గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది.
నోట్: మహిళలు రుతుస్రావం, గర్భధారణ సమయంలో ఈ ఆసనం చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment