ఎఫైర్‌; భర్తను జైలుకి పంపాలని స్కెచ్‌.. ట్విస్ట్‌ ఏంటంటే! | Faridabad: Woman Plants Marijuana In Husband Auto Over Affair | Sakshi
Sakshi News home page

భర్తను ఇరికించేందుకు భార్య స్కెచ్‌ .. ఊహించని షాక్‌!

Apr 22 2021 12:42 PM | Updated on Apr 22 2021 3:23 PM

Faridabad: Woman Plants Marijuana In Husband Auto Over Affair - Sakshi

చండీఘఢ్‌:  భర్తను కటకటాల్లోకి నెట్టాలని భావించి ఓ  భార్య చేసిన కుట్ర బెడిసికొట్టింది. తనన మోసం చేస్తున్నాడని భావించి అతడిని ఇరికించేందుకు చేసిన ప్లాన్‌ ఫెయిల్‌ అవ్వడంతో ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి అతను రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇక ఒక్కోరోజు అసలు ఇంటికే వెళ్లేవాడే కాదు. దీంతో తన భర్త ఎందుకు ఇంటికి రావడం లేదని ఆలోచించిన భార్య అతనిపై క్రమంగా అనుమానం పెంచుకుంది. 

ఈ నేపథ్యంలో భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అపోహ పడింది. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని అనుమానించి రగిలిపోయింది. ఈ విషయం పలుమార్లు భర్తతో చర్చించగా వీరి మధ్య తరుచూ గొడవలు అయ్యేవి. దీంతో విసిగి పోయిన మహిళ.. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ మాస్టర్‌ ప్లాన్ వేసింది. ఢిల్లీ వెళ్లి మరీ ఓ వ్యక్తి వద్ద గంజాయి మొక్కను కొనుక్కొచ్చింది. సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను తన భర్త ఆటోలో పెట్టింది. తరువాత తనకేం సంబంధం లేనట్లు గుర్తు తెలియని మహిళ మాదిరిగా పోలీసులకు ఫోన్ చేసి గంజాయి విషయం చెప్పి భర్తను బుక్ చేయాలని చూసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు కిలాడీ భార్యేనని తెలిసి ఆమెకు షాకిచ్చారు. ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

చదవండి: 
వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నారు: హైకోర్టు ఆవేదన
యువతితో దిగిన ఫొటోతో స్టేటస్‌.. భార్య చూడటంతో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement