
థానే: మహారాష్ట్రలోని ఒక వ్యక్థి ఘోరమైన అకృత్యానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని, కూతుళ్లను నిర్ధాక్షణ్యంగా సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డోంబివిలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఈ ఘటనలో నిందితుడి భార్య 35 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కూతుళ్లు సమీర(14), సమీక్ష(11) 90 శాతం తీవ్రంగా గాయపడ్డారని అన్నారు.
ఐతే వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితుడు ప్రీతీ శాంతారామ్ పాటిల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు విచారణలో నిందుతుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని కూతుళ్లను వేధిస్తున్నాడని, అందులో భాగంగానే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.
ఈ క్రమంలో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఐతే ఈ ఘటన శనివారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరిగితే సుమారు 8.30 గం.లకు...అంటే దాదాపు మూడు గంటల ఆలస్యంతో వెలుగులోకి వచ్చిందని, అందువల్లే బాధితులు తీవ్రంగా గాయలపాలయ్యారని అన్నారు.
(చదవండి: దారుణం.. కత్తులతో పొడిచి చంపుతున్నా చూస్తూ ఉండిపోయారు!)
Comments
Please login to add a commentAdd a comment