రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందకు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న నిబంధనలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు చాలా మంది వాహనదారులు. కళ్లముందే ఘోరమైన రోడ్డుప్రమాదాలు జరుగుతున్న కనువిప్పు కలగకపోవడం దురదృష్టం. ఏయే వాహనాల్లో ఎంతమంది ప్రయాణించాలానే రూల్ కూడా ఉంది. ఐతే డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది వాహనదారులు పరిమితికి మించి జనాలను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడొక ఒక ఆటో డ్రైవర్ అలాంటి పనే చేశాడు. విచిత్రమేమిటంటే అతను పోలీస్ కార్యాలయం నుంచి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం.
వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక ఆటో డ్రైవర్ చిన్నారులను ఏకంగా ఆటోపైన కూర్చోబెట్టి తీసుకువెళ్లాడు. సుమారు ముగ్గురు చిన్నారులను ఆటో పైన కూర్చొబెట్టాడు. ఆ ముగ్గురు చిన్నారులు సుమారు 11 నుంచి 13 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేస్తూ "ఎవరైనా తమ పిల్లలను ఇలా పాఠశాలకు పంపగలారా?" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు.
పైగా ఆ ఆటో సమీపలోని ఆర్టీవో ఆఫీస్, నకిటీయా పోలీస్ ఔట్‌పోస్ట్ నుంచి వెళ్లినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోకపోవడ విచిత్రం అని పేర్కొన్నాడు. బహుశా అందరూ నిద్రపోతున్నారంటూ... కామెంట్ చేశాడు. దీంతో బరేలీ పోలీసులు ఈ వైరల్ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని, పైగా ఇలాంటి డ్రైవర్లను అనుమతించకుండా పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతామని చెప్పారు.
How can someone send their children to school with such a careless auto driver. Visuals from UP's Bareilly. This auto crossed office of RTO, Nakatia police outpost on Friday but everyone seemed to be sleeping. No action taken with registration no. UP25ET8342 by@Uppolice pic.twitter.com/hcfidtIJFS
— Raj Kumar Bhim Army (@Rajkuma79883678) August 28, 2022
(చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment