
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునజ్జు అయింది. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment