
సాక్షి,విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఓ తల్లి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి బందర్ కాలువలోకి దూకింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు తల్లి,పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. సంవత్సరంలోపు వయసుగల పసికందును వెలికి తీశారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అయితే హాస్పటల్‌కు తరలించే లోపే పసికందు మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లి, కుమారుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.