పట్టపగలే వృద్ధురాలి హత్య
Published Tue, Aug 9 2016 11:49 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
నర్సంపేట : పట్టణ శివారులోని సర్వాపురంలో ఓ వృద్ధురాలిని పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సర్వాపురానికి చెందిన కోల పూలమ్మ(65) నర్సం పేట– మహబూబాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో నివా సం ఉంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరి గా జీవిస్తోంది. పెద్ద కుమారుడు అశోక్ ఖమ్మం జిల్లా పాల్వం చలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డాడు. కూతురు అరుణ కేసముద్రంలో ఉం టోంది. ప్రతి రోజు పూలమ్మ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి వచ్చేదని, మధ్యాహ్నం నుంచి కనిపించలేదని చుట్టు పక్కల వారు తెలిపా రు. పూలమ్మ ఉంటున్న ఇంట్లోని పక్క గదిలో మరో మహిళ వలపదాసు వసంత అద్దెకు ఉంటూ, బీడీలు చుట్టేందుకు బయటకు వెళ్లి సాయంత్రం వస్తోంది. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న వసంత పక్కగది తలుపులు దగ్గరికి వేసి ఉండడంతో అనుమానం వచ్చి తెరిచి చూడగా పూలమ్మ మృతి చెంది కని పించింది. దీంతో ఆమె చుట్టుపక్కలవారికి తెలపగా పోలీసుల కు సమాచారమిచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుతోపాటు చెవి కమ్మలు దోచుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ఇం ట్లో చొరబడి హత్యచేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
తెలిసినవారే హతమార్చారా ?
ఒంటిరిగా ఉంటున్న పూలమ్మ గ్రామంలో ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ ఉండేదని, మెడలో బంగారు గొలుసుతోపాటు చెవులకు బంగారు కమ్మలు ఉండటాన్ని చూసిన దుండగులే నగల కోసం హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గదిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి వద్దకు తెలిసిన వ్య క్తులు వెళ్లడం వల్లనే ప్రతిఘటించలేదని, నగలు తీసుకున్న వ్య క్తులు తమను గుర్తుపట్టి ఉంటుందని, బయటకు తెలియకుండా ఉండేందుకు తలపై బాది గదిలో ఉన్న బియ్యం మూటను ముఖంపై అదిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
క్లూస్ టీంతో తనిఖీలు
వృద్ధురాలి అనుమానాస్పద మృతి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ దాసరి మురళీధర్, సీఐ బోనాల కిషన్, ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీంను రప్పించి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement