అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్ అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన తనతోపాటు బాలరామునికి ఐదు కానుకలు తీసుకువచ్చారు.
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ విదేశాంగ మంత్రికి యూపీకి చెందిన సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. నేపాల్ విదేశాంగ మంత్రితో పాటు ఆయన భార్య జ్యోత్స్నా సౌద్ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేపాల్ విదేశాంగ మంత్రి రామ్‌లల్లాకు ఐదు రకాల వెండి ఆభరణాలను సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతులు, కాళ్లకు ధరించే కంకణాలు మొదలైనవి ఉన్నాయి. విదేశాంగ మంత్రి సౌద్ అయోధ్యను సందర్శించడానికి వచ్చిన నేపాల్ ప్రభుత్వ తొలి మంత్రి. ఆయన సరయూ నది ఒడ్డున సాయంత్రం జరిగే హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment