srirama
-
ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్‌ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్‌లింక్ ఫెన్స్‌కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! -
బాలరామునికి నేపాల్ నుంచి కానుకలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్ అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన తనతోపాటు బాలరామునికి ఐదు కానుకలు తీసుకువచ్చారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ విదేశాంగ మంత్రికి యూపీకి చెందిన సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. నేపాల్ విదేశాంగ మంత్రితో పాటు ఆయన భార్య జ్యోత్స్నా సౌద్ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ విదేశాంగ మంత్రి రామ్‌లల్లాకు ఐదు రకాల వెండి ఆభరణాలను సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతులు, కాళ్లకు ధరించే కంకణాలు మొదలైనవి ఉన్నాయి. విదేశాంగ మంత్రి సౌద్ అయోధ్యను సందర్శించడానికి వచ్చిన నేపాల్ ప్రభుత్వ తొలి మంత్రి. ఆయన సరయూ నది ఒడ్డున సాయంత్రం జరిగే హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. -
రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్!
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ఆలయానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో రామాలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపునకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. దానిపై ముచ్చట గొలిపే కళాకృతులు ఉన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ తలుపు 12 అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు. రామ మందిరంలో మొత్తం 46 తలుపులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత వేయనున్నారు. గుడి మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకు బంగారు పూత ఉండదు. మీడియా నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో మరో 13 బంగారు తలుపులను అమర్చనున్నారు. రామాలయం తలుపునకు సంబంధించిన ఫొటోలో రెండు ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి. ద్వారం పైభాగంలో రాజభవనం తరహా ఆకృతి కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు ముకుళిత హస్తాలతో కనిపిస్తారు. తలుపునకు దిగువన చదరపు ఆకారంలో అందమైన కళాకృతులు కనిపిస్తాయి. ఈ తలుపులను తయారు చేసేపనిని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ చేపడుతోంది. ఈ కంపెనీ మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నుంచి తలుపులకు అవసరమయ్యే కలపను ఎంపిక చేసింది. తలుపులను కన్యాకుమారికి చెందిన కళాకారులు తయారుచేస్తున్నారు. నూతన రామాలయానికి సంబంధించి బయటకు వస్తున్న ఫొటోలను అనురించి చూస్తే రామాలయం ఎంతో వైభవంగా ఉండనున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం -
‘శ్రీరాముడు మాంసాహారి’: ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత డాక్టర్ జితేంద్ర అవద్ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలన్నారు. దేశ స్వాతంత్ర్యం గురించి ప్రస్తావించిన ఆయన ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నది వాస్తవమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ నేత గాంధీజీ ఓబీసీ అనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వివాదం తలెత్తింది. 31 ఏళ్ల క్రితం రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారిని తాజాగా అరెస్ట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలా అరెస్ట్ చేయడం యాదృచ్ఛికమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శ్రీకాంత్ పూజారి మద్యం అక్రమ విక్రయాలు, జూదంతో సహా 16 సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీఎం తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేయకపోతే రాముడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇటీవల సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా కొత్త వివాదం సృష్టించారు. భారత్ హిందూ దేశంగా మారితే అది ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్లా మారుతుందని వ్యాఖ్యానించారు. -
‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు?
అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ‘రామనంది’ సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ఇంతకీ ‘రామనంది’ శాఖను ఎవరు స్థాపించారు? ఈ సంప్రదాయంలోని నియమాలు ఏమిటి? రామనంది శాఖను జగత్గురు శ్రీ రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా పిలుస్తారు. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు జపించే మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’ ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు. రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో భగవంతుని పూజిస్తారు. వీరు పూజా విధానంలో బాలరాముడిని ప్రతిరోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి తమ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు. రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు రాకండి! -
శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక!
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందనుంది. ఈ వాటర్ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర జలమార్గాలను ప్రోత్సహించడానికి సన్నాహాలు చేశారు. ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటుంది. వాటర్ మెట్రోలో 50 అత్యాధునిక సీట్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఘాట్ నుండి మెట్రో వరకు పర్యాటకులు వంతెనగా ఉపయోగించేందుకు రెండు జెట్టీలు కూడా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి! -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్‌కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం
రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపిక అయిన అర్చక అభ్యర్థులు బుధవారం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరికీ నేటి నుంచి అంటే గురువారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈ ఆరు నెలల శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులకు శ్రీరామ జన్మభూమి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలలో అర్చకులుగా నియమించనున్నారు. మరోవైపు శిక్షణ కార్యక్రమాలకు వచ్చిన అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రతి అర్చక అభ్యర్థికి నెలకు రూ. 2,000 ఇవ్వనున్నారు. అర్చక శిక్షణకు వచ్చిన అభిషేక్ పాండే మాట్లాడుతూ శ్రీరాముని ఆరాధనా విధానం, పూజలు మొదలైన వాటిపై తమకు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగా అర్చక అభ్యర్థులకు శిక్షణ సమయంలో అర్హత కలిగిన ఆచార్యుల దగ్గర సమస్త ఆచార వ్యవహారాలు నేర్పించనున్నారు. అయోధ్యలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
హైదరాబాద్ చేరుకున్న అయోధ్య శ్రీరామ అక్షింతలు
-
భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
-
ఆపాదమస్తకం.. రామనామం
సాక్షి, భద్రాచలం: ‘ఓ రామ.. శ్రీరామ.. నీ నామమెంతో రుచిరా’అంటూ వేనోళ్ల కీర్తించాడు భక్త రామదాసు. కానీ ఆ గ్రామంలోని అందరూ వయో, లింగ భేదం లేకుండా ఆపాదమస్తకం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ దేహాన్నే దేవాలయం గా మార్చుకున్నారు. మనసును, దేహాన్ని శ్రీరామమయంగా మలుచుకున్నారు. అపర రామదాసుల్లా శ్రీరాముడిని నిత్యం కీర్తిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లా సారంగడ్ తాలూకాలో నందేలి అటవీ ప్రాంతంలో ‘శ్రీరామనామి’తెగ వారు జీవిస్తుంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిరస్సు నుంచి పాదం వరకు శ్రీరామ నామాలను పచ్చబొట్టుతో పొడిపించుకుంటారు. శ్రీరాముడిని ఆవహించుకున్నట్లు భక్తిభావంతో ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపిస్తుంటారు. ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమ నిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. దేహాన్నే ఆలయంగా మార్చుకుని.. 19వ శతాబ్దంలో నాటి సామాజిక పరిస్థితుల వల్లే ‘శ్రీరామనామి’తెగ ఆవిర్భవించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి ఉన్నత తెగల వారు దేవాలయాల్లోకి కింది వర్గాల వారిని అనుమతించకపోయేవారు. దీంతో 1890వ దశకంలో పరశురామ్ అనే వ్యక్తి తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ప్రచారంలో ఉంది. ఆయనే ‘శ్రీరామనామి సమాజ్’కు ఆద్యుడు అని చెబుతుంటారు. అప్పటి నుంచి ఆ తెగకు చెందిన వారు శ్రీరామనామాన్ని చెరిగిపోని ముద్రగా భక్తి భావంతో ఉంచుకొని తమ దేహాన్నే దేవాలయంగా మలుచుకొని శ్రీరాముడిని కొలుస్తున్నట్లు చెబుతారు. ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శిరస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. ఏటా మూడ్రోజులు భజన రామనామి తెగ ఆధ్వర్యంలో ఏటా అక్కడ డిసెంబర్, జనవరిలో మూడు రోజుల పాటు భజన మేళా నిర్వహిస్తారు. అక్కడి తెగ వారి సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ఈ మేళాకు హాజరవుతారు. జాతరకు పెద్ద సంఖ్యలో తెగకు చెందిన వారు హాజరుకావడంతో పాటు ఆ తెగకు చెందిన యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. -
కత్తి మహేశ్ దిష్టిబొమ్మ దహనం
మల్యాల/రామడుగు: రాముడిపై అనుచిత వ్యా ఖ్యాలుచేసిన కత్తి మహేశ్ దిష్టిబొమ్మను విశ్వహిం దూపరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మంగళవా రం మల్యాల మండలంలో దిష్టిబొమ్మను దహనంచేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. భజరంగ్‌దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిని గృ హనిర్భందం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రా జారంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో భజరంగ్ దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్తోపాటు బట్టు నరేశ్, గణేశ్, నరేశ్, చొప్ప దండి నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ జిన్నాం విద్యాసాగర్, నాయకులు జిట్టవేని అంజిబాబు, బండపల్లి శ్రీధర్, రమేశ్ పాల్గొన్నారు. -
రాములోరికి ముత్తంగి సేవ
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారికి సోమవారం భక్తిశ్రద్ధలతో ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది తీర్థ జలాలతో భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు. అంతరాలయంలో మూలవరులకు ముత్యాల వస్త్రాలు ధరింపజేసి..ముత్తంగి సేవ అనంతరం బేడా మండపానికి చేర్చారు. కంకణధారణ గావించి, స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేను లాడెన్‌ను.. నేను రాముడ్ని!
హైదరాబాద్: ‘నేను ఒసామా బిన్ లాడెన్‌ను.. నేను రాముడ్ని.. నేనే దేవుడ్ని..’ అంటూ గురువారం ఉదయం హైదరాబాద్ కోఠిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ వద్ద ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్‌కుమార్(35) కొన్నేళ్లుగా నగరంలోని చప్పల్‌బజార్‌లో నివాసం ఉంటూ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని దేనా బ్యాంక్‌లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా పని చేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో బ్యాంక్ అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. గురువారం ఉదయం కోఠి గాంధీ జ్ఞాన్ మందిర్ వద్దకు వచ్చిన రామ్‌కుమార్.. ఇనుప రాడ్‌ను పట్టుకుని అక్కడ రోడ్డుపై వెళ్తున్న ప్రజలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో టోలీచౌకికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సమీఉద్దీన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుస్టేషన్‌లోనూ అతడు వీరంగం సృష్టించాడు. దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబడి.. నేను దేవుడ్ని.. వెల్ ఎడ్యుకేటెడ్ని అని అరుస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి 20 మంది పోలీసులు కలసి అతడికి బేడీలు వేసి కట్టడి చేశారు. -
రాములోరి తలంబ్రాలకు... వరిసాగు
తూర్పుగోదావరి(రాజానగరం):భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం నాలుగేళ్లుగా ఏటా గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి సమర్పించే తలంబ్రాల నిమిత్తం సంఘం ఆధ్వర్యంలో రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో వరిసాగుకు సోమవారం శ్రీకారం చుట్టారు. నాతిపాము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో జై శ్రీరామ్’అని జపిస్తూ, ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు. తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్తనం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పంట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు. -
దసరా గజేంద్రుడికి ఎందుకు తిక్కరేగింది?
మైసూరు: అంగరంగ వైభవంగా జరిగే మైసూరు ఉత్సవాల్లో గజేంద్రుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుందనే విషయం అందరికి తెల్సిందే. అయితే అశేష జనసందోహం, పిల్లల కేరింతల మధ్య ఏనుగులు మావటీలు చెప్పిన మాటవిని బుద్ధిగా నడుచుకోవడం మామూలు విషయం కాదు. వాటికి ఎంతో క్రమశిక్షణ నేర్పుతారు. గత 20 ఏళ్లుగా శ్రీరామ, గజేంద్ర అనే పేర్లుగల రెండు ఏనుగులు దసరా ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 60 ఏళ్ల గజేంద్రుడు, 59 ఏళ్ల శ్రీరామా ఎప్పుడూ కలిసిమెలసి ఆప్యాయంగానే ఉంటాయి. గత ఆదివారం నాడు ఏమైందోగానీ గజేంద్రుడికి తిక్కరేగి గణపతి అనే మావటి సహాయకుడిని చంపడమే కాకుండా అన్నేళ్లుగా తోడుగా వుంటున్న శ్రీరామాను కూడా వెంటాడి వెంటాడి చంపేసింది. ఆ తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. రంగనాథస్వామి ఆలయానికి చెందిన జంతుసంరక్షణశాలలో చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామం పట్ల ఇటు ఆలయ నిర్వాహకులు, అటు సంరక్షణ కేంద్రం అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక అడవుల పొలిమేరల్లో, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో అటవి ఏనుగులు బీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పలు సందర్భాల్లో వాటిని దారిలో తీసుకరావడానికి శ్రీరామా ఏనుగు ఎంతో తోడ్పడిందని ఫారెస్ట్ అధికారి నాగరాజ్ తెలిపారు. ఇంతవరకు దాదాపు 75 అటవి ఏనుగులను మచ్చిక చేసుకొని దారిలోకి తీసుకరావడానికి తోడ్పడిన శ్రీరామా మిత్రుడి చేతిలోనే చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకాలం రంగనాథ ఆలయ గజపతిగా సేవలందించిన శ్రీరామాకు సోమవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గజేంద్రుడి అనూహ్య ఆగ్రహానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ వినయ్ లూత్రా మీడియాకు తెలిపారు.