రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్‌! | Ayodhya Ram Mandir Golden Door Photos - Sakshi
Sakshi News home page

Ayodhya: రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్‌!

Published Wed, Jan 10 2024 12:51 PM | Last Updated on Wed, Jan 10 2024 1:16 PM

Ayodhya Golden Door Photos Ram Mandi News - Sakshi

అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఈనెల 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ఆలయానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. 

ఈ క్రమంలో రామాలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపునకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. దానిపై ముచ్చట గొలిపే కళాకృతులు ఉ‍న్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ తలుపు 12 అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు.

రామ మందిరంలో మొత్తం 46 తలుపులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత వేయనున్నారు. గుడి మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకు బంగారు పూత ఉండదు. మీడియా నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో మరో 13 బంగారు తలుపులను అమర్చనున్నారు. రామాలయం తలుపునకు సంబంధించిన ఫొటోలో రెండు ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి.

ద్వారం పైభాగంలో రాజభవనం తరహా ఆకృతి కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు ముకుళిత హస్తాలతో కనిపిస్తారు. తలుపునకు దిగువన చదరపు ఆకారంలో అందమైన కళాకృతులు కనిపిస్తాయి. ఈ తలుపులను తయారు చేసేపనిని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ చేపడుతోంది. 

ఈ కంపెనీ మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నుంచి తలుపులకు అవసరమయ్యే కలపను ఎంపిక చేసింది. తలుపులను కన్యాకుమారికి చెందిన కళాకారులు తయారుచేస్తున్నారు. నూతన రామాలయానికి సంబంధించి బయటకు వస్తున్న ఫొటోలను అనురించి చూస్తే రామాలయం ఎంతో వైభవంగా ఉండనున్నదని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement