అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు.
త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందనుంది. ఈ వాటర్ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర జలమార్గాలను ప్రోత్సహించడానికి సన్నాహాలు చేశారు.
ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటుంది. వాటర్ మెట్రోలో 50 అత్యాధునిక సీట్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఘాట్ నుండి మెట్రో వరకు పర్యాటకులు వంతెనగా ఉపయోగించేందుకు రెండు జెట్టీలు కూడా నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
Comments
Please login to add a commentAdd a comment