అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్‌కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది.
ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు.
కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది.
తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం!
Comments
Please login to add a commentAdd a comment