రాములోరికి ముత్తంగి సేవ | Sakshi
Sakshi News home page

రాములోరికి ముత్తంగి సేవ

Published Mon, Aug 8 2016 11:08 PM

రాములోరికి ముత్తంగి సేవ

భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారికి సోమవారం భక్తిశ్రద్ధలతో ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది తీర్థ జలాలతో భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు. అంతరాలయంలో మూలవరులకు ముత్యాల వస్త్రాలు ధరింపజేసి..ముత్తంగి సేవ అనంతరం బేడా మండపానికి చేర్చారు. కంకణధారణ గావించి, స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement