బడికి వెళ్లొచ్చేసరికి దోచేశారు | Theft in Eluru | Sakshi
Sakshi News home page

బడికి వెళ్లొచ్చేసరికి దోచేశారు

Published Mon, Oct 5 2015 8:09 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Theft in Eluru

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వంగాయగూడెం సమీపంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వెంకటరమణ, శ్రీలతాగౌతమి దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం వీరు స్కూల్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.

ఇంట్లోని రెండు బీరువా తలుపులు కూడా బద్దలు కొట్టి ఉన్నాయి. వాటిల్లోని 30 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామారావు, క్లూస్‌టీమ్ సీఐ కె.నరసింహమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement