మిస్టరీగా మారిన నగల గల్లంతు | ornaments disappear mistery.. | Sakshi

మిస్టరీగా మారిన నగల గల్లంతు

Aug 4 2016 12:08 AM | Updated on Sep 4 2017 7:40 AM

హన్మకొండలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ నక్కలగుట్ట బ్రాంచి లాకర్‌లోని బంగారు ఆభరణాలు మాయమైన ఘటన మిస్టరీగా మారింది.

వరంగల్‌ : హన్మకొండలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ నక్కలగుట్ట బ్రాంచి లాకర్‌లోని బంగారు ఆభరణాలలు మాయమైన ఘటన మిస్టరీగా మారింది. భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఆంజనేయులుకు బ్యాంక్‌లో లాకర్‌ ఉంది. ఈ లాకర్‌లో పెట్టిన ఆభరణాలు మాయమైనట్లు ఆయన సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పందించి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు బుధవారం మళ్లీ విచారణ చేపట్టారు. ఈలోగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. లాకర్‌లో పెట్టిన నగలు సుమారు రూ.15లక్షల విలువ చేస్తాయని బాధితుడు చెప్పడంతో బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లాకర్‌లో పెట్టిన నగల పూర్తి బాధ్యత వినియోగదారుడికే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాను నగలు బ్యాంకు లాకర్‌లో పెట్టినా, అందులో లేవని బాధితుడు వాపోతుండడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement