nakkalagutta
-
మిస్టరీగా మారిన నగల గల్లంతు
వరంగల్ : హన్మకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నక్కలగుట్ట బ్రాంచి లాకర్లోని బంగారు ఆభరణాలలు మాయమైన ఘటన మిస్టరీగా మారింది. భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులుకు బ్యాంక్‌లో లాకర్ ఉంది. ఈ లాకర్లో పెట్టిన ఆభరణాలు మాయమైనట్లు ఆయన సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పందించి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు బుధవారం మళ్లీ విచారణ చేపట్టారు. ఈలోగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. లాకర్లో పెట్టిన నగలు సుమారు రూ.15లక్షల విలువ చేస్తాయని బాధితుడు చెప్పడంతో బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లో పెట్టిన నగల పూర్తి బాధ్యత వినియోగదారుడికే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాను నగలు బ్యాంకు లాకర్లో పెట్టినా, అందులో లేవని బాధితుడు వాపోతుండడం గమనార్హం. -
కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శనివారం కూడా ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. రామకుప్పం మండలం రామాపురం తండా సమీపంలో గజరాజులు ఘీంకారాలతో హోరెత్తిస్తున్నాయి. వీర్నమల ప్రాంతంలో పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో సమీప గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ షాకుతో రామాపురం తండా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో గురువారం ఓ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన ఏనుగులు అక్కడే మకాం వేశాయి. రాత్రంతా గుంపులోని మిగిలిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ అక్కడే ఉండిపోయాయి. ఎలాగైన కిందపడ్డ ఏనుగును తీసుకెళ్లాలని ప్రయత్నించాయి. మరోవైపు మృతి చెందిన ఏనుగును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
ఏనుగు మృతితో దద్దరిల్లిన రామాపురం తండా
-
ఏనుగు మృతితో దద్దరిల్లిన రామాపురం తండా
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామాపురంతండాలోని నక్కలగుట్ట వద్ద కరెంట్ షాక్‌తో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఏనుగు మరణించింది. దీంతో 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. దాంతో ఆ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దాంతో గ్రామస్తులు ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో స్థానిక అటవీశాఖ అధికారులు అడవిలోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. దీంతో చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు, జూ అధికారులకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీంతో వారు ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. కొంతమంది దుండగులు వన్యప్రాణుల కోసం విద్యుత్ వైర్ల అమర్చారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు షాక్‌తో మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు.