ఏనుగు మృతితో దద్దరిల్లిన రామాపురం తండా
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామాపురంతండాలోని నక్కలగుట్ట వద్ద కరెంట్ షాక్తో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఏనుగు మరణించింది. దీంతో 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. దాంతో ఆ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దాంతో గ్రామస్తులు ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో స్థానిక అటవీశాఖ అధికారులు అడవిలోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు.
దీంతో చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు, జూ అధికారులకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీంతో వారు ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. కొంతమంది దుండగులు వన్యప్రాణుల కోసం విద్యుత్ వైర్ల అమర్చారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు షాక్తో మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు.