విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Lord Venkateswara Ornaments Hid At Chandrababu Residences Says Vijayasai | Sakshi
Sakshi News home page

విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Wed, May 23 2018 11:06 AM | Last Updated on Thu, Aug 9 2018 2:44 PM

Lord Venkateswara Ornaments Hid At Chandrababu Residences Says Vijayasai - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్‌ సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్‌ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు.

తన కుమారుడు లోకేష్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణను కోరడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అభిమానాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement