కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయంటూ వచ్చిన వార్తలు వట్టివేనని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)స్పష్టం చేసింది. ‘సోన్‌భద్రలో అంత భారీగా బంగారు నిల్వలను మేం కనుగొనలేదు. అటువంటి సమాచారమేదీ మేం ఇవ్వలేదు’ అని జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ కోల్‌కతాలో శనివారం మీడియాకు తెలిపారు. తమ అన్వేషణలో ఇదే జిల్లాలో దాదాపు 52వేల టన్నుల ఇనుప ఖనిజం బయటపడిందనీ, ఇందులో టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. బహుశా ఈ వార్తనే సోన్‌భద్ర జిల్లా అధికారులు మరోలా వెల్లడించి ఉంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment