సాక్షి, ముంబై: వెండి , బంగారం ధరలు మళ్లీ నింగివైపు చూస్తున్నాయి. రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు గురు, శుక్రవారాల్లో మళ్లీ ఊపందుకున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. గురువారం నాటి రూ. 54,200తో పోలిస్తే రూ 54,800 పలుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 650 ఎగిసి రూ.59,780గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. గురువారంతో పోలిస్తే వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 72,600గా ఉంది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 225 లేదా 0.38శాతం తగ్గి రూ.59,340 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కిలో రూ.7 తగ్గి రూ.70,205 వద్దకు చేరింది.
(ఇది చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు)
మరోవైపు ప్రతికూల ప్రపంచ సంకేతాలతో గ్లోబల్‌గా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ రేటు పెంపు అంచనాలతో డాలర్ స్థిరంగా ఉండటంతో స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సుకు 1,991 డాలర్లుగాఉంది. వెండి రేటు 0.01శాతం తగ్గింది. ఈ ప్రభావం దేశీయంగా ఉండే అవకాశం ఉందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment