సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లులాభాల్లోకి మళ్లాయి. యూఎస్ ఫెడ్ వరుస వడ్డీ వడ్డనతో నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు వెంటనే నష్టాలనుంచి తేరుకోవడం విశేషం. 278 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు లాభంతో 60965 వద్ద, నిప్టీ 16 పాయింట్లు పాజిటివ్‌గా 18099 వద్ద కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్ గ్రిడ్ నష్టపోతుంగా, టైటన్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, మారుతి లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో స్వల్ప నష్టాలతో 82.83 వద్ద ఉంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా నాల్గవ సారి 75 బేసిస్ పాయింట్లు (bps) పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment