Today Gold Rate in Hyderabad అమెరికా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే నిర్ణయించనుందన్న అంచనాల మధ్య డాలర్ బలపడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,943.30 డాలర్ల వద్ద ఉంది. అటు దేశీయంగా కూడా కూడా పసిడి పరుగుకు బ్రేక్‌లు పడుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి 59,450గా ఉంది. 80 వేల రూపాయల నుంచి దిగొచ్చిన కిలో వెండి ధర 76,900 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!)
ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో (Today Gold Price in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 50 రూపాయలు క్షీణించి 54,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,550 పలుకుతోంది.
అటు డాలర్ మరింత బలంపుంజుకున్నప్పటికీ, దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో లాభపడుతోంది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే10 పైసలు ఎగిసి 82.55వద్ద ఉంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకుని లాభాల్లోకి మళ్లాయి
Comments
Please login to add a commentAdd a comment