Video: చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే | Secret Behind Megastar Chiranjeevi's Urban Monk Look - Sakshi
Sakshi News home page

చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

Published Tue, Sep 15 2020 11:40 AM | Last Updated on Tue, Sep 15 2020 3:31 PM

Mega Star Chiranjeevi Urban Monk Look Video  - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్‌ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్‌ చరణ్‌ ​కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పలువురు చిరు న్యూలుక్‌ సూపర్‌ అంటూ స్పందించారు. అయితే తాజాగా విడుదలయిన వీడియోతో చిరు గుండు వెనుక ఉన్న అసలు నిజం బయటపడిపోయింది. చిరు ఓ సినిమాలో క్యారెక్టర్‌ కోసం నిజంగానే గుండు చేయించుకొని ఉంటారని అందరూ భావించారు. అయితే చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్‌ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్‌ తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్‌ మాంక్‌’ మేకింగ్‌ వీడియోని చూసేయండి. 

చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement