Acharya Movie Siddha First Look: Ram Charan As Siddha Looks Miraculous As He Accompanies His Comrade Chiranjeevi - Sakshi
Sakshi News home page

ఆచార్యలో రామ్‌చరణ్‌ ఫస్ట్ లుక్ అదుర్స్‌

Mar 27 2021 10:44 AM | Updated on Mar 27 2021 12:49 PM

Ram Charan Rocks As Siddha - Sakshi

ఆచార్యలో సిద్దగా చరణ్‌ లుక్‌ అదుర్స్‌ అంటూ సాషల్‌ మీడియాలో కామెంట్లు

మెగా స్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కమర్షియల్‌ చిత్రాల్లో సందేశాన్ని జోడించి హిట్‌ చిత్రాకలు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అపడేట్‌ను నిన్న చిరు విడుదల చేశారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా 27 మార్చి 2021న ‘నా సిద్ధ వస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. చెప్పినట్లుగానే సిద్ధ పాత్రలో చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది.

మెగాపవర్‌ స్టార్‌ నిన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామరాజుగా తన లుక్‌తో ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ రోజు సిద్ధగా ఇంకో లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక పోస్టర్‌ విషయానికొస్తే, రామ్ చరణ్ చిరు తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఈ ఫోటో చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌ ఫోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచి సోషల్ మీడియా యూజర్లు, ఇతర ప్రముఖులు మెగాస్టార్‌లో మునుపటి గ్రేస్‌ ఇంకా తగ్గలేదంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నట్లు నెట్టింట కామెంట్ల రూపంలో తమ ప్రేమను తెలుపుతున్నారు.

మే 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆచార్య’ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  ఆలయం సెట్‌కే చాలా ఖర్చపెట్టినట్లు టాక్‌ .ఇందులో కాజల్ అగర్వాల్, సోను సూద్, రామ్చరణ్, పూజా హెగ్డే, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్ ఉన్నారు. మణిశర్మఈ చిత్రానిక సంగీతం అందించనున్నారు. గతంలో చిరు-మణిశర్మ కాంబినేషన్‌లో పలు చిత్రాలు రాగా అన్నిమ్యూజికల్‌ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆల్ ది బెస్ట ఫర్‌ ‘ఆచార్య’ ( చదవండి: 'రామరాజు'గా రామ్‌చరణ్‌ పోస్టర్‌ విడుదల )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement