
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పేరును ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో పలువురు అగ్రనటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?)
ఈ పాత్ర కోసం మొదట దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ పేరును అనుకున్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా తమన్నా పేరును ఖరారు చేశారంట. ఇటీవల తమన్నాకు వీడియో కాల్ ద్వారా దర్శకుడు పాత్రను వివరించగా వెంటనే మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే చిరు ‘సైరా నర్సింహారెడ్డి’లో తమన్నా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. మెగాస్టార్ 152వ చిత్రమైన ‘ఆచార్య’కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభంకానుంది. (చదవండి: ‘ఆచార్య’లో మహేశ్.. చిరు స్పందన)
Comments
Please login to add a commentAdd a comment