
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి, ప్రముఖ సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ సైరాపై స్పందిస్తూ.. సైరా టీజర్ అదిరిపోయింది సర్.. ఫ్యాన్స్ అందరిలాగానే మేం కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. చిరంజీవి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన డీఎస్‌పీ ప్రధానంగా తమ (చిరంజీవి, డీఎస్‌పీ) కాంబినేషన్‌లోని పాపులర్ సాంగ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో సైరా సరసింహారెడ్డికి సూపర్ డూపర్ మ్యూజికల్ విషెస్ తెలిపారు. దీంతో మెగా అభిమానులు లైక్‌లు, రీట్వీట్‌లతో పండగ చేసుకుంటున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజును (ఆగస్టు 22) పురస్కరించుకొని, మెగా అభిమానులు బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా వేడుకలను జరుపుకున్నారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా వస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రిలీజైన సైరా టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.
Wishing our Dearest 1 & Only #MEGASTAR #Annayya #Chiranjeevi Sir a SUPER DUPER MUSICAL HAPPY BIRTHDAY !!😁🎵🎶🎹❤️🎂🎂🎂🎂🎂🎂🎂🎂
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 22, 2019
Love frm my Whole Team❤️😍#SyeRaaNarasimhaReddy #HBDMegaStarChiranjeevi @KonidelaPro #RamCharan @upasanakonidela @IAmVarunTej @IamSaiDharamTej pic.twitter.com/v5jNjLc7oB