Chiranjeevi Vacation Tour To USA With Wife After Bhola Shankar Movie - Sakshi
Sakshi News home page

Chiranjeevi US Tour: వెకేషన్‌లో మెగాస్టార్ .. ఫోటోలు షేర్ చేసిన చిరంజీవి!

Published Fri, Jul 7 2023 2:04 PM | Last Updated on Fri, Jul 7 2023 2:21 PM

Chiranjeevi Vacation Tour To USA With Wife After Bhola Shankar Movie - Sakshi

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా చిరంజీవి తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మెగాస్టార్ విదేశాలకు పయనమయ్యారు.

(ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల)

వెకేషన్‌కు అమెరికా వెళ్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సతీమణితో విమానంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. షూటింగ్‌లతో ఎప్పుడు బిజీగా ఉండే చిరంజీవి.. కాస్తా తీరిక సమయం లభిస్తే విదేశాల్లో వాలిపోతుంటారు. కాగా.. రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.  ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్‌ కీలక పాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. వెకేషన్‌ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని  చిరంజీవి వెల్లడించారు. 

(ఇది చదవండి:  మీ క్యాలెండర్‌లో ఇది మార్క్‌ చేసుకోండి: చిరంజీవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement