ఆ బడా 'గ్యాంగ్ లీడర్'లాగే.. ఈ ఛోటా లీడర్! | Was trying to imitate Megastar from Gangleader, says Varun Tej ‏ | Sakshi
Sakshi News home page

ఆ బడా 'గ్యాంగ్ లీడర్'లాగే.. ఈ ఛోటా లీడర్!

Published Tue, Jul 12 2016 8:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

Was trying to imitate Megastar from Gangleader, says Varun Tej ‏

హైదరాబాద్‌: ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్‌ ఆడించేగలను’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్‌’గా చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో మెగాస్టార్ మాస్ ఇమేజ్ మరోమెట్టు ఎక్కింది. అభిమానుల్లో ఆయన స్టైల్ ఓ ట్రెండ్ సృష్టించింది. చొక్కా కాలర్‌ ఎగరేస్తూ చిరు ఈ సినిమాలో ఇచ్చిన పోజు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. అందుకే ఆ స్టైల్‌ నే ఈ బుజ్జీ మెగా హీరో ఇమిటేట్ చేశాడు.

ఇంతకు ఈ ఛోటా 'గ్యాంగ్ లీడర్' ఎవరు అని అనుకుంటున్నారా.. నాగాబాబు తనయుడు, 'కంచె' హీరో వరుణ్ తేజ్. చిన్నప్పుడే పెద్దనాన్న స్టైల్‌ ఫిదా అయిపోయిన వరుణ్ అప్పట్లోనే ఇలా గ్యాంగ్ లీడర్ ఫోజు ఇచ్చాడు.  ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ బడా గ్యాంగ్ లీడర్ లాగే .. ఈ ఛోటా గ్యాంగ్ లీడర్ కూడా అభిమానులకు తెగ నచ్చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement