Gangleader
-
1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే
మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజును నేడు (ఆగష్టు 22) జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌కు ఇది పండుగరోజు. కానీ ఈ మధ్యే చిరంజీవి కాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరగడం. అదీ కాకుండా చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగలడం వంటి చేదు గుర్తుల నుంచి వారు బయటపడేందుకు మెగస్టార్ పుట్టినరోజు ఒక టానిక్‌లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన కొత్త సినిమా ప్రకటన కూడా ఉండటంతో వారు మరింత జోష్‌లో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోస్ చిరంజీవినే ఇన్స్‌ఫరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిగిలిన హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం చాలా భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ,వాల్తేరు వీరయ్య మినహా మిగిలిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోలేదు... సైరా సినిమాలో ఆయన నటన మెప్పించినా కలెక్షన్స్ పరంగా నష్టాలే తెచ్చిందని చెప్పవచ్చు ఒకరకంగా చిరంజీవి 1990 నాటి సమయంలో తన సినీ కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఎలా మళ్లీ నిలదొక్కుకున్నాడంటే... 1990 దశకంలో ఏం జరిగింది 1990 సమయంలో కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ ఒక సునామిలా భారీ కలెక్షన్స్‌తో ఇండస్ట్రీలో దుమ్మురేపాయి. కానీ 1993లో వచ్చిన 'ముఠామేస్త్రి' తర్వాత చిరంజీవి కెరియర్ కొంచెం తటపటాయించింది. ఆ పాట కోసం 500 మంది డ్యాన్సర్లు ఆ సమయంలో 'మెకానిక్ అల్లుడు' సినిమా లాంచ్ అయ్యింది. చిరంజీవిపై అభిమానంతో కనీసం కథ కూడా వినకుండా అక్కినేని నాగేశ్వరావు మెకానిక్ అల్లుడులో చేశారు. అలా వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానులు విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కాగా బి గోపాల్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో 'ఝుమ్మని తుమ్మెద వేట' సాంగ్ కోసం అప్పట్లో రూ.25 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పట్లో అదో రికార్డు. 7 రోజుల షూటింగ్... 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఇన్నీ హంగు ఆర్భాటాలు ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ పోలీస్ రియల్ లైఫ్ స్టోరీనే ఈ సినిమా ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ నుంచి తొలి సినిమా 'ముగ్గురు మొనగాళ్లు' వచ్చింది. అందులో చిరంజీవి త్రిపాత్రాభినయం చేశారు. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, నగ్మా, రోజా వంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆయనకు భారీగా నష్టాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఎస్పీ 'పరుశురాం' సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో ఉండే వాల్టర్ అనే పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం అప్పట్లో బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న శ్రీదేవిని పిలిపించి అందుకు గాను భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి చేపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఆ సినిమా చుట్టూ ఎన్నో విమర్శలు అలా బ్యాక్ టూ బ్యాక్‌గా చిరంజీవికి డిజాస్టర్ సినిమాలు వస్తున్న సమయంలో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో మాస్ మసాలా ఎంటర్టైనర్ 'అల్లుడా మజాకా' వచ్చింది. సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని, సెన్సార్ వాళ్లు దీనిని పూర్తిగా నిషేధించాలని పలువురు కోరారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న చిరంజీవికి ఇది మరో దెబ్బ . అలాంటి సమయంలో చిరంజీవి అభిమానులు చాలా చోట్ల రోడ్డు మీదకి వచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పట్టుబట్టి ఎదోలా సినిమా రిలీజ్ అయ్యేలా చేసుకున్నారు. చిరంజీవి మార్కెట్ ఏంటో గుర్తుచేసిన సినిమా ఇదే మొత్తానికి 'అల్లుడా మజాకా' సినిమా థియేటర్లో పడింది. ఆపై విజయఢంకా మోగించింది. అప్పటి వరకు సుమారు 3 ఏళ్లకు పైగా ప్లాపుల్లో ఉన్న చిరంజీవి సినిమా మార్కెట్‌పై అంచనాలు తగ్గాయి. ఈ సినిమా విడుదలతో ఆయన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో పాటు పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత 1995లో మళ్లీ బిగ్‌బాస్, రిక్షావోడు రెండూ భారీ డిజాస్టర్లే చిరుకు దక్కాయి. తెలుగులో ఫస్ట్ డాల్బీ సిస్టమ్ ఆడియో ఉన్న సినిమా రిక్షావోడు. చిరు కెరీర్లో సినిమాలకు దూరంగా ఈ సినిమాతోనే 'రూప్ తేరా మస్తానా' తెలుగులో మొదటి ర్యాప్ సాంగ్‌ను ఇండస్ట్రీకి చిరంజీవి పరిచయం చేశారు. ఈ సినిమా కోసం డ్యాన్స్, నటన విషయంలో ఎంతో కష్టపడి సినిమా తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అప్పట్లో ఈ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం ఊహించలేదని చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే మెగాస్టార్ మొట్టమొదటిసారి తన కెరీర్లో బ్రేక్ తీసుకున్నారు. ఏ సినిమా షూటింగ్‌కు వెళ్లకుండా .. కనీసం కథ కూడా వినకుండా సుమారు సంవత్సరం పాటు ఉన్నారు. ఈ సినిమాతో వెంటనే బ్లాక్‌బస్టర్ కొట్టిన చిరు అప్పటి వరకు సంవత్సరానికి 3 లేదా 4 సినిమాలు తీసే చిరంజీవి 1996లో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆ తర్వాత 1997లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ నుంచి 'హిట్లర్'గా మెగాస్టార్ తిరిగొచ్చారు. ఒకరకంగా ఆయనకు ఇదీ కం బ్యాక్ సినిమా అని చెప్పవచ్చు. 49 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. ఆ వెంటనే రజనీ కాంత్ 'భాషా' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సురేష్ కృష్ణతో చిరంజీవి 'మాస్టర్' సినిమాను ఒప్పుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగులో మొట్టమొదటి డిటిఎస్ సౌండ్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పడిలేచిన కెరటం 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాతో అంజన ప్రొడక్షన్స్ అందుకున్న డిజాస్టర్‌ను చిరంజీవి మరిచిపోలేదు. 1998లో అదే ప్రొడక్షన్లో 'బావగారు బాగున్నారా' సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో 54 సెంటర్లలో 100రోజులు ఆడింది. అలా ఆయన పడిలేచిన కెరటంలా తన జర్నీని కొనసాగించారు. అందుకే చాలామంది యంగ్ హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్తు ఉంటారు. వరుస డిజాస్టర్ల తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా,చూడాలని ఉంది,స్నేహం కోసం,అన్నయ్య వంటి చిత్రాలు వచ్చాయి. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకాధరణ పొందలేదనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో స్టామినా ఉన్న హీరోకు ఒక్క హిట్ సినిమా పడితే చాలు రికార్డులన్నీ గల్లంతు అవుతాయని చెప్పడానికి. రాబోయే రోజుల్లో ఆయన నుంచి అలాంటి హిట్ సినిమా తప్పకుండా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి ఆయన ఎప్పటికీ మెగాస్టారే... -
టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరి నటులు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతి రావు మృతి మరువకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత వల్లభనేని జనార్ధన్(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో మరోసారి విషాదం నెలకొంది. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్ధన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’, నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీఎస్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు జనార్ధన్. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇక మామ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంతోనే వల్లభనేని జనార్ధన్ సినీరంగ ప్రవేశం చేశారు. చదవండి: విషాదంలో రకుల్.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ మరో కొత్త వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు -
‘గ్యాంగ్ లీడర్’ ప్రెస్‌మీట్
-
‘గ్యాంగ్ లీడర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
గుంటూరు వీవీఐటీలో ‘గ్యాంగ్‌లీడర్’ సందడి
-
భాగ్యనగరంలో గ్యాంగ్‌లీడర్
‘‘జీ ఏ యన్ జీ గ్యాంగ్, గ్యాంగ్, బచావో బ్యాంగ్ బ్యాంగ్’’ అంటూ అప్పట్లో చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో ఎంతో సందడి చేశారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పేరుతో హీరో నాని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నాని హీరోగా విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో తాజా ‘గ్యాంగ్‌లీడర్’ రూపొందుతోంది. నాని సరసన ప్రియాంక అనే తమిళ భామ ఈ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరపై ఆరంగేట్రం చేయనుంది. నాని 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ‘గ్యాంగ్‌లీడర్’. తాజా షెడ్యూల్‌ను ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రారంభించి 20వ వరకు షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్లో సినిమాకి ఎంతో కీలకమైన కొంత టాకీతో పాటు, ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తారట. రొమాంటిక్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నాని నటించిన ‘జెర్సీ’కి స్వరాలందించిన అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి స్వరకర్త. -
డేట్ ఫిక్స్
గ్యాంగ్ లీడర్‌గా నాని తన గ్యాంగ్‌ను ఎలా లీడ్ చేశారు? తన గ్యాంగ్‌తో కలసి అతను చేసిన అల్లరేంటి? ఇవన్నీ మనకు చూపించే డేట్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ 30న తన గ్యాంగ్‌తో కలసి థియేటర్స్‌లోకి దిగుతారట. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘‘గ్యాంగ్‌లీడర్ ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటన్నది స్క్రీన్ మీద చూస్తేనే బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్ నుంచి వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ స్టార్ట్ అయింది. జూన్ 30కి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అనిరు«ద్, సీఈఓ: చిరంజీవి. -
ఈ ఏడాది మూడు రిలీజ్లు!
నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. రాబోయే సినిమాలు తనను తిరిగి ఫాంలో నిలబెడతాయన్న ఆశతో ఉన్నాడు. ఈ యంగ్ హీరో నటించిన పిరియాడిక్ డ్రామా జెర్సీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్ జానర్లో గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు నాని. ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించి డిసెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ మూడు సినిమాలు నాని తిరిగి ఫాంలోకి తీసుకుస్తాయోమే చూడాలి. -
ఆ బడా 'గ్యాంగ్ లీడర్'లాగే.. ఈ ఛోటా లీడర్!
హైదరాబాద్: ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ ఆడించేగలను’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్’గా చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో మెగాస్టార్ మాస్ ఇమేజ్ మరోమెట్టు ఎక్కింది. అభిమానుల్లో ఆయన స్టైల్ ఓ ట్రెండ్ సృష్టించింది. చొక్కా కాలర్ ఎగరేస్తూ చిరు ఈ సినిమాలో ఇచ్చిన పోజు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. అందుకే ఆ స్టైల్ నే ఈ బుజ్జీ మెగా హీరో ఇమిటేట్ చేశాడు. ఇంతకు ఈ ఛోటా 'గ్యాంగ్ లీడర్' ఎవరు అని అనుకుంటున్నారా.. నాగాబాబు తనయుడు, 'కంచె' హీరో వరుణ్ తేజ్. చిన్నప్పుడే పెద్దనాన్న స్టైల్ ఫిదా అయిపోయిన వరుణ్ అప్పట్లోనే ఇలా గ్యాంగ్ లీడర్ ఫోజు ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోను ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ బడా గ్యాంగ్ లీడర్ లాగే .. ఈ ఛోటా గ్యాంగ్ లీడర్ కూడా అభిమానులకు తెగ నచ్చేస్తున్నాడు. Was trying to imitate Megastar from Gangleader #majorthrowback#childhood pic.twitter.com/a94VoMtMYv — Varun Tej (@IAmVarunTej) 12 July 2016