ఈ ఏడాది మూడు రిలీజ్‌లు! | Nani Releasing 3 Movies With Short Gap | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మూడు రిలీజ్‌లు!

Published Wed, Apr 10 2019 1:21 PM | Last Updated on Wed, Apr 10 2019 1:39 PM

Nani Releasing 3 Movies With Short Gap - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. రాబోయే సినిమాలు తనను తిరిగి ఫాంలో నిలబెడతాయన్న ఆశతో ఉన్నాడు. ఈ యంగ్ హీరో నటించిన పిరియాడిక్‌ డ్రామా జెర్సీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్‌ జానర్‌లో గ్యాంగ్‌ లీడర్ సినిమాను ప్రారంభించాడు.

ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లో మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు నాని. ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించి డిసెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ మూడు సినిమాలు నాని తిరిగి ఫాంలోకి తీసుకుస్తాయోమే చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement