మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ఇదే | megastar 150th movie title finalized | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ఇదే

Published Sun, Aug 21 2016 3:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ఇదే

మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టయిల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే ఓ అప్‌డేట్ అందించారు. మెగాస్టార్ షూటింగ్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా చేస్తున్నారంటూ రత్నవేలు కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement