Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి.. భారత సినీ పరిశ్రమకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. తొలుత సహానటుడిగా ఎంట్రి ఇచ్చిన ఆయన విలన్‌గా ఆ తర్వాత హీరో ఎదిగారు. బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్‌లను అందిస్తూ సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారు. సినిమాల్లో ‘స్వయం కృషి’తో ఎదిగిన ఆయన తన నటన, డ్యాన్స్‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా హీరోగా నేటితరం యువ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఒక్క ఆయనకే చెల్లింది. దాదాపు 150పైగా చిత్రాల్లో నటించిన చిరు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించి మెగాస్టార్ అంటే ఒక ఓ బ్రాండ్ అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అభిమానులంతా మెగాస్టార్ మెగాస్టార్ అంటూ జపం చేసే ఈ బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో మీకు తెలుసా?. అసలు ఆయనకు ఈ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా? మరి తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.
(చదవండి: ఆ కారణంగా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ఏర్పాటైంది..)
ఎన్టీఆర్, కృష్ణ వంటి సూపర్‌స్టార్‌లు తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న సమయంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కేఎస్. రామారావు. చిరంజీవి, కేఎస్ రామారావుల కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అభిలాష’. యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే యండమూరి నవల ఆధారంగా కొందండరామి రెడ్డీ దర్శకత్వంలో నిర్మాత కేఎస్ రామరావు నిర్మాణంలో చిరు హీరోగా ‘ఛాలెంజ్’ ‘రాక్షసుడు’ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాయి. అయితే రాక్షసుడు మూవీతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత చిరంజీవి, కేఎస్ రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం ‘మరణ మృదంగం’. ఇది కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ సాదించింది. ఈ చిత్రం టైటిల్‌తోనే అప్పటి వరకు సుప్రీం హీరో ఉండే చిరంజీవి పేరు మెగాస్టార్ చిరంజీవిగా మారింది. సినిమా పేర్లు పడుతుండగా హీరో పేరు రాగానే మెగాస్టార్ అని రావడంతో థియేటర్ అంతా అభిమానుల ఈళలతో మారుమోగిందట. ఈ సినిమాతో నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు ఇది. అప్పటి వరకు చిరును సుప్రీం హీరోగా పిలుచుకునే అభిమాలంతా మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment