
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.

ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు.‘పునాదిరాళ్ళు’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి.

ఇప్పటి వరకు 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది.

గిన్నీస్ బుక్‌లో తన పేరు వస్తుందని అసలు ఊహించలేదని చిరంజీవి అన్నారు.తనకు నటన మీద కన్న డాన్స్ మీద ఉన్న ఇష్టమే ఈ గిన్నీస్ అవార్డు రావడానికి ప్రధాన కారణం అని చిరంజీవి అన్నారు.

నటనకు అవార్డ్స్ వస్తాయి ..కానీ ఈ రకంగా నా డాన్స్ లకు కూడా అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.