సాక్షి, ముంబై : ప్రఖ్యాత నటి, బాలీవుడ్ తొలి ఫీమేల్ సూపర్‌స్టార్ శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది. ముంబైకి చేరుకున్న ఆమె పార్థీవ దేహానికి ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే హిందూ స్మశానవాటికలో ఆమె భౌతికకాయనికి అంత్యక్రియలు జరగనున్నాయి.
శ్రీదేవి మృతితో బాలీవుడ్, టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ముంబైలోనూ విషాదఛాయలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మృతికి సంతాపంగా ఈసారి హోలీ పండుగ జరుపుకోవద్దని ఆమె నివసిస్తున్న హౌసింగ్ సొసైటీ వాసులు నిర్ణయించారు. ముంబైలోని గ్రీన్ ఎకర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో శ్రీదేవి కుటుంబం నివాసముంటున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూసిన విషాద పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల (మార్చి) 2న తలపెట్టిన హోలీ వేడుకలను రద్దు చేసుకున్నామని.. ఆ రోజున సంగీతవిభావరులు, రెయిన్ డ్యాన్స్, రంగులు చల్లుకోవడం, కమ్యూనిటీ భోజన కార్యక్రమాలుగానీ ఉండవని సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment