
Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అకాల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఎన్నో అనుమాల మధ్య శ్రీదేవి మరణాన్ని నిర్ధరించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి నటన, అందం, అభినయాన్ని సినీలోకం గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి గురువారం కావడంతో ఆమె ఙాపకాలను నెమరువేసుకుంటున్నారు.
ఈ క్రమంలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వెనిస్లో బోనీ కపూర్ శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన కోట్స్ రాశాడు. 'మేము సెప్టెంబర్ 7, 2008న మిలన్ నుంచి వెనిస్కు వెళ్లాం. ఆ నగరంలో కొన్ని గంటలు మాత్రమే గడిపాం. మేము వెనిస్ని మళ్లీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ప్రణాళికలను విధి తిరస్కరించింది.' అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశాడు బోనీ కపూర్. అలాగే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గతంలో తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment