
శ్రీదేవి పార్థివదేహం (తాజా ఫొటో)
ముంబై : అశేష జనవాహినిని అర్ధశతాబ్ధంపాటు అలరించి, ఎన్నెన్నో మరుపురాని పాత్రల్లో జీవించి మెప్పించిన మేటి నటి శ్రీదేవి మానవలోకానికి సెలవంటూ సాగిపోయారు. బుధవారం ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి ముందు శ్రీదేవి పార్థివదేహంపై జాతీయ జెండాను ఉంచి, ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను శ్రీదేవి కుటుంబం మీడియాకు విడుదలచేసింది. తనకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరలో శ్రీదేవిని అలంకరించారు. ‘శ్రీదేవి చివరి సంతకం’గా సంబోధిస్తూ ఈ ఫొటోను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులెందరో శ్రీదేవి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment