రాంగోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణం ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఎంత కుదిపేసిందో చెప్పనక్కర్లేదు. ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ఆయన ట్వీట్ల పర్వం ఆదివారం వరకు కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఆ తర్వాత మూగబోయాడు.
అయితే ఆయన స్పప్నసుందరి మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడం, ఫొరెన్సిక్ రిపోర్ట్‌లో ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని వార్తలు రావడం వర్మను తీవ్రంగా కలిచి వేశాయి. ఆమె అందం గురించి మాట్లాడుకునే జనాలు ఇప్పుడు ఆమె ఎలా చనిపోయిందో మాట్లాడుకుంటున్నారని సోషల్‌మీడియా వేదికగా వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మరోసారి ట్వీట్ల పర్వం మొదలెట్టాడు.
‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంద’ని వర్మ ట్వీట్ చేశాడు.
మరో ట్వీట్‌లో తాను తెరకెక్కించన ’గోవిందా గోవిందా’ సినిమాలోని అమ్మ బ్రహ్మదేవుడో పాటను షేర్ చేస్తూ.. ‘ నేను ఈ పాటను కేవలం ఆమె అందం వర్ణించడం కోసం తీసాను. ఇంత అందమైన అమ్మాయి ఇలా చనిపోవడం సబబేనా?’ అని ప్రశ్నించాడు.
Can any person’s life end in a more tragic and in a more horrific way?
— Ram Gopal Varma (@RGVzoomin) 26 February 2018
Its traumatic to hear her being dissected in so many terrible ways ? I feel like just fucking kill myself https://t.co/po7Cq5x9Pk
I wanted this songs lyric content to be the upper limit description of the divineness of her beauty ..Can u see this song and just tell me how the hell can this woman just like that die? https://t.co/X4Ch4WcN1u
— Ram Gopal Varma (@RGVzoomin) 27 February 2018
Comments
Please login to add a commentAdd a comment