శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించలేం | Dubai Prosecutor seeks more time for probe | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 26 2018 8:25 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Dubai Prosecutor seeks more time for probe - Sakshi

దుబాయ్‌ : నటి శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు భారత్‌కు అప్పగించలేమని దుబాయ్‌ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలిపారు. 

శ్రీదేవి మృతి కేసును దుబాయ్‌ పోలీసులు..ప్రాసిక్యూషన్‌ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌ అధికారి ఒకరు భారతీయ మీడియాతో మాట్లాడారు. ఫోరెనిక్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా  ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు మరిన్ని పత్రాలు కావాలని భారత కాన్సులేట్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని ఆయన తేల్చేశారు.

దీంతో ఆమె భౌతిక కాయన్ని భారత్‌ తరలించే విషయంపై సంగ్దిగ్ధత నెలకొంది. మరోవైపు బోనీ కపూర్‌ మూడు గంటలపాటు విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్‌ విడిచివెళ్లరాదని బోనీకపూర్‌‌కు ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలిపినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement