శ్రీదేవి మృతితో మరో నటికి అనారోగ్యం! | kangana ranaut deeply disturbed by sridevis sudden demise | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మృతితో మరో నటికి అనారోగ్యం!

Published Tue, Feb 27 2018 12:26 PM | Last Updated on Tue, Feb 27 2018 5:13 PM

kangana ranaut deeply disturbed by sridevis sudden demise - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి మూడు రోజుల గడుస్తున్నా అమె లేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వెండితెరపై తనదైన ముద్రవేసిన శ్రీదేవి హఠాన్మరణం అభిమానులతో పాటు సినీ ప్రముఖులను తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రముఖుల నివాళులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతో మంది యువ నటీనటులు శ్రీదేవి నటన చూసి స్పూర్తి పొందినవారున్నారు. శ్రీదేవి నటన చూసి ఎంతో నేర్చుకున్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పిన నటి కంగనా రనౌట్‌.. ఆమె మరణ వార్తతో తీవ్ర మనస్థాపానికి గరైందట. శ్రీదేవి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. అయితే శ్రీ మరణవార్త విన్నప్పటి నుంచి కంగనా అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాశమైంది. గత రెండురోజులుగా కంగనా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. గతనెల (జనవరి)లో అనురాగ్‌ బసు నిర్వహించిన సరస్వతి పూజలో శ్రీదేవి, కంగనా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఎంతో అప్యాయంగా మాట్లాడుకున్నారు.

జనవరిలో జరిగిన సరస్వతి పూజలో శ్రీదేవి, కంగనా 

టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో ఝాన్సీ ల‌క్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా మ‌ణిక‌ర్ణిక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.  ఈ క్రమంలో ఆదివారం శ్రీదేవి మరణవార్త విన్న కంగనా షాక్‌కు గురైందట. ఈ నేపథ్యంలోనే ఆమె జ్వ‌రం బారిన ప‌డ్డార‌ని తెలుస్తోంది.  కాగా, కంగనా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేసింది చిత్ర యూనిట్‌.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement