ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై నెలకొన్న అనుమానాలన్నింటికీ తెరదించుతూ.. ప్రమాదవశాత్తునే ఆమె మరణించినట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తేల్చారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భర్త బోనీ కపూర్‌కు కూడా క్లీన్ చీట్ లభించింది. కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు, ఆమె మృతదేహానికి ఎంబామింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు రాత్రి 10.30కు శ్రీదేవీ మృతదేహం ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకోనుంది. అనిల్ అంబానీకి చెందిన ఛార్టెడ్ విమానంలో శ్రీదేవీ మృతదేహాన్ని ముంబైకి తరలిస్తున్నారు.
- రాత్రి పదిన్నరకు ముంబై ఛత్రపతి విమానశ్రయానికి శ్రీదేవీ మృతదేహం
- రేపు ఉదయం 9 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీ క్లబ్‌కు పార్థీవదేహం తరలింపు
- ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం పన్నెడున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతి
- లకడ్‌వాలా కాంప్లెక్స్ గార్డెన్ నెం.5లో శ్రీదేవీ సంతాప సమావేశం
- మధ్యాహ్నం పన్నెడున్నర నుంచి ఒకటింటి వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ
- రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
- మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు
శనివారం రాత్రి 11 దాటిని తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత అనుకున్నారు. కానీ అనంతరం ఆమె పోస్టు మార్టం నివేదికలో, శ్రీదేవీ ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని దుబాయ్ వైద్యులు తేల్చారు. ఆమె దేహంలో ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారీ టబ్‌లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు. అయితే, ఈ క్రమంలో బోనీ కపూర్‌ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు వచ్చాయి. కానీ చివరికి వాటన్నంటికి పుల్‌స్టాప్ పెడుతూ దర్యాప్తు క్లియర్ అయిందని, ఇక ఎలాంటి అనుమానం లేదని, ఆమె అనుకోకుండా బాత్‌డబ్‌లో పడి ఊపిరి ఆడక చనిపోయారంటూ దుబాయ్ విచారణ అధికారులు తేల్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment