‘సన్నీలియోన్‌ చనిపోతే ఏం చేస్తారో?’ | Actress kashuri Post on Sunny Leone became Controversy | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 1 2018 8:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

Actress kashuri Post on Sunny Leone became Controversy - Sakshi

సాక్షి, చెన్నై : నటి కస్తూరి తరచూ వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కాస్టింగ్‌ కౌచ్‌, సీనియర్‌ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీయగా.. ఈ మధ్యే కమల్‌ రాజకీయ ప్రస్థానంపై కూడా ఆమె చవాక్కులు పేల్చి ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఇక తాజాగా ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టు దుమారాన్ని రేపుతోంది. 

‘శ్రీదేవి చనిపోయిందని అన్ని న్యూస్‌ ఛానెళ్లు ఆమెకు సంబంధించిన పాటలను, వీడియోలను ప్రదర్శిస్తున్నాయి. ఒకవేళ సన్నీ లియోన్‌ చనిపోతే అప్పుడు ఏం ప్రదర్శిస్తాయో’ అంటూ ఓ ట్వీట్‌ను ఆమె చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఫేస్‌ బుక్‌లో వచ్చిన ఓ జోక్‌ సందేశాన్నే తాను పెట్టినట్లు ఆమె స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఈ సమయంలో ఇలాంటి అసందర్భోచిత పోస్టు చేయటం.. పైగా ఒక నటి అయి ఉండి మరో నటిని అవమానించటం సరికాదని కస్తూరి తీరును పలువురు తప్పుబడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement