
శ్రావణ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు
గుంటూరు: రాజధాని ప్రాంతంలో మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ హల్‌చల్ చేశారు. రాజధానిలో 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి తుళ్లూరు మండలంలో చొరబడి టీడీపీ నాయకుల ఇళ్లలో బస చేశారు.
ఆర్–5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ 24, 25, 26 తేదీలలో పలు రకాల నిరసనలు తెలియజేస్తామంటూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. బుధవారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్దకు వచ్చి హడావుడి చేసేందుకు యత్నించిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విజయవాడకు తరలించారు.