
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయుడు
రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
పెదకాకాని: భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని పెదకాకానిలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం అన్ని కులాలు, మతాలతో ముందుకు వెళుతుందంటే భారత రాజ్యాంగం వలనే సాధ్యమవుతుందన్నారు. నిరంతరం ప్రజల అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సు కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడిన స్ఫూర్తిదాత డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా నేటి యువత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గోళ్ల శ్యాం ముఖర్జీబాబు, వుయ్యూరి సతీష్‌రెడ్డి, బీసీ విభాగం జిల్లా అధక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, బండ్లమూడి చక్రి, భాను పలువురు నాయకులు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
గుంటూరు ఎడ్యుకేషన్: గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అణగారిని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపర్చడంతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు. రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ సమన్యాయం కల్పించేందుకు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘ నాయకుడు కూచిపూడి మోహనరావు, జెడ్పీ అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి వై.నాగరాజా, ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వై.గోపాలకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి శివ సూర్యనారాయణ అధ్యక్ష వహించారు. అంబేడ్కర్ ఆశయాలు, సాధించిన విజయాలు గురించి బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి వివరించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
నగరంపాలెం: జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పశ్చిమ సబ్‌డివిజన్ డీఎస్పీ అరవింద్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ మహనీయుడు స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయుడు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయుడు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయుడు