కానిస్టేబుల్‌ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అదృశ్యం

Apr 15 2025 1:36 AM | Updated on Apr 15 2025 1:36 AM

కానిస

కానిస్టేబుల్‌ అదృశ్యం

మంగళగిరి టౌన్‌: కానిస్టేబుల్‌ అదృశ్యంపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా ఫరూఖ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని టిప్పర్ల బజార్‌లో గత కొంతకాలంగా కుటుంబంతో కలసి ఉంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు. వైజాగ్‌లో ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ ఉందంటూ ఫారుక్‌ ఈ నెల 8వ తేదీన వైజాగ్‌ బయలుదేరి వెళ్లాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో తన భర్తకు ఫోన్‌ చేసినట్లు ఆ సమయంలో వైజాగ్‌లోనే ఉన్నానని చెప్పినట్లు బషీరున్‌ ఫిర్యాదులో పేర్కొంది. 10వ తేదీ ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. మళ్లీ రెండు రోజుల తరువాత ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఫరూఖ్‌ కుటుంబ సభ్యులు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు 12వ తేదీన మంగళగిరి చేరుకుని మంగళగిరి నగరంలోని ఆక్టోపస్‌ కార్యాలయానికి బషీరున్‌ను తీసుకుని వెళ్లారు. ఆక్టోపస్‌ కార్యాలయంలో అధికారులకు జరిగిన విషయం చెప్పడంతో ఫరూఖ్‌ ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలవు పెట్టి ఉన్నాడని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు గుంటూరుకు చెందిన వై. మధుసూదనరావు విరాళం అందజేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష, బంగారు గోపురం అభివృద్ధి పనుల నిమిత్తం మరో రూ. లక్ష, దేవస్థానంలో గో సంరక్షణ నిమిత్తం రూ.లక్ష, శివాలయం అభివృద్ధి పనులకు రూ.15,101 కలిపి మొత్తం రూ.3,15,101 విరాళంగా సోమవారం ఆలయ అధికారులను కలిసి అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. అనంతరం దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

తప్పిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని ఏల్చూరులో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకుల బాలికా విద్యాలయ్యాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు పద్మావతి సోమవారం సందర్శించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థినులకు అంబేడ్కర్‌ చరిత్ర గురించి విరించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధన చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. బాలల హక్కుల గురించి వివరించారు. పదో తరగతి పాసైన విద్యార్థినులకు కేజీబీవీలోనే ప్రవేశాలు కల్పించే విధంగా సమగ్ర శిక్ష, విద్యాశాఖను కోరినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళా పీఎస్‌ డీఎస్పీగా శ్రీనివాసరెడ్డి

పట్నంబజారు: గుంటూరు మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా డి.శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నెల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం వీఆర్‌లో నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా గుంటూరు మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా ఆయన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి బాధ్యతలు చేపట్టారు.

కానిస్టేబుల్‌ అదృశ్యం 1
1/2

కానిస్టేబుల్‌ అదృశ్యం

కానిస్టేబుల్‌ అదృశ్యం 2
2/2

కానిస్టేబుల్‌ అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement