దినేష్‌కు 8 వికెట్లు | Dhenash took eight wickets | Sakshi
Sakshi News home page

దినేష్‌కు 8 వికెట్లు

Published Sat, Nov 16 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Dhenash took eight wickets

జింఖానా, న్యూస్‌లైన్: రాజు సీసీ బౌలర్ దినేష్ 8 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినప్పటికీ విజయం చేకూరలేదు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సాయి సత్య 29 పరుగుల తేడాతో రాజు సీసీ జట్టుపై గెలుపొందింది. తొలి రోజు బ్యాటింగ్  చేసిన సాయి సత్య 149 పరుగులు చేసింది.
 
 
 ఆకర్ష్ (54) అర్ధ సెంచరీతో రాణించాడు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన రాజు సీసీ 120 పరుగులకే ఆలౌటైంది. అమిత్ (51) అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. సాయి సత్య బౌలర్లు మిఖిల్ 5, ప్రతీక్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో బౌలర్ శ్రవణ్ కుమార్ (6/59) విజృంభించడంతో కాంటినెంటల్ జట్టు విజయం దక్కించుకుంది. మొదట సలీంనగర్ 126 పరుగులు చేసిం ది. తర్వాత బరిలోకి దిగిన కాంటినెంటల్ రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసిం ది.

శశిధర్ రెడ్డి (53) అర్ధ సెంచరీతో రాణించగా, రోహిత్ (47) మెరుగ్గా ఆడాడు. కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు 7 వికెట్ల తేడాతో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుపై నెగ్గింది. తొలుత స్పోర్టింగ్ ఎలెవన్  164 పరుగులకే ఆలౌటైంది. వెంకటేష్ (63) రాణించగా, వికాస్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కేంబ్రిడ్జ్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ 5, అద్నాన్ 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత కేంబ్రిడ్జ్ మూడే వికెట్లు కోల్పోయి 168 పరుగుల చేసింది. మీర్ జావీద్ (73) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా, మనూల్ 35 పరుగులు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement