
సాక్షి, విజయవాడ: డొల్ల కంపెనీలకు భూ కేటాయింపులపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. అర్హతలేని వివిధ డొల్ల కంపెనీలకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) వేల ఎకరాల భూములను కేటాయించిందని పేర్కొంటూ వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. మాజీ న్యాయాధికారి శ్రావణ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు.