Shell Companies
-
తప్పు చేయకపోతే గగ్గోలెందుకు?
సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. స్కిల్ స్కామ్‌లో సీఐడీ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతోనే దర్యాప్తు చేస్తున్నారని, రూ.241 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. కస్టోడియల్ కస్టడీలో విచారిస్తే నిజ నిర్ధారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తన చేతికి ఆ రిమాండ్ రిపోర్టు అందినందున, ఇందులో నిజా నిజాలు, క్రెడిబులిటీ చెప్పదల్చుకున్నానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి.. ♦ ఎంతో మంది నాయకులు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. కొంత మందికి శిక్షలు పడ్డాయి. నిర్దోషులు హానరబుల్ (గౌరవం)గా బయటకొచ్చారు. కానీ ఎక్కడా జరగని విధంగా ఇక్కడే ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కేసు విషయంలో కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఆయన అరెస్టు సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఈ నెల 9న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ♦ ప్రభుత్వ డబ్బు (ప్రజాధనం) బోగస్ ఇన్వాయిస్ల ద్వారా టెక్నాలజీ పార్ట్నర్స్కు, ఇతరులకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. వారికి ఇచ్చిన డబ్బుకు లెక్కలేదు. దానికి జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ అథారిటీ వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్లూ విచారించారు. తర్వాత ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత.. దీనికి సంబంధించి కొన్ని కీ నోట్ ఫైల్స్ మిస్ అయ్యాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ♦ 141 మంది సాకు‡్ష్యలను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఎవరి అకౌంట్లో పడింది.. నిధులు ఎలా దారి మళ్లాయి.. షెల్ కంపెనీల ద్వారా తిరిగి వీళ్ల వద్దకు ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఇవన్నీ మరింత స్పష్టంగా విచారించడానికే చంద్రబాబును అరెస్టు చేశారు. నేరం చేయకపోతే భయమెందుకు? ♦ చంద్రబాబు ఏ రకమైన నేరం (ఫ్రాడ్) చేయకపోతే, నిధులు దుర్వినియోగం చేయకపోతే, నిబంధనలు ఉల్లంఘించకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు రాకపోతే, అది 409 కిందకు రాకపోతే ఎందుకు భయపడుతున్నట్లు? నిధులు అక్రమంగా మళ్లింపు(సైఫెన్) అని తెలుస్తోంది. ఆ డబ్బు దుర్వినియోగం అయినట్టు తేటతెల్లమైంది. సీఐడీ పోలీసులు రికార్డును బట్టే ముందుకెళ్తున్నారు. ♦ ఇది సరికాదనుకున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది.. జరిగిందిదీ అని ఆ ఆరు షెల్ కంపెనీలు వచ్చి చెప్పడం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రైవేటు కెపాసిటీతో ఏదైనా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో మా కంపెనీకి ఏ సంబంధం లేదని సిమన్స్ ఇండస్ట్రీ వాళ్లు చెబుతున్నారు. డిజైన్ టెక్ ప్రైవేట్ కంపెనీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. షెల్ కంపెనీలు కూడా వాస్తవ సమాధానం చెప్పడం లేదు. ఇంత మందికి శిక్షణ ఇచ్చామని, ఇన్ని పరికరాలు కొన్నామని బెయిల్ పిటిషన్లలో ఎందుకు చెప్పలేదు? ♦ ఇంత క్లియర్‌గా కేసు ఉంటే ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విచిత్రం అనిపిస్తోంది. ఆయన సత్యవంతుడని నిరూపించుకుంటే రేపు పరువు నష్టం దావా వేయొచ్చు. ఇలా గగ్గోలు పెట్టడం అనవసరం. ఇంత కంటే పూర్తి ఆధారాలతో కూడిన(ఫుల్ ఫ్రూఫ్) కేసు నేను చూడలేదు. అనుమానాలకు తావులేదు. గవర్నర్ అనుమతి అవసరం లేదు ♦ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలనే వాదన జరుగుతోంది. సెక్షన్ 17ఎ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 2018లో ఫోర్స్‌లోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన నేరాలకు అది వర్తించదు. కాబట్టి అవి అంతకంటే ముందు నేరాలు కాబట్టి 17ఎ లో గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది వర్తించదు. అచ్చెన్నాయుడు కేసులో ఇది డిసైడ్ అయ్యింది. ♦ అరెస్టు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇవన్నీ విచారణలో భాగమే. దాదాపు 141 మంది సాకు‡్ష్యలను విచారించారు. ఏడుగురిపై రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. తర్వాత అత్యంత ఎక్కువ సమాచారం సేకరించారు. దర్యాప్తునకు సహకరించడ లేదు. అంతకు ముందు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ సహకరించడం లేదు. తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం వీరికి చేరిందనేది నిర్ధారణ కావాలంటే అరెస్ట్ చేసి విచారిస్తేనే నిజానిజాలు బయటపడతాయి. -
చంద్రబాబుకు వత్తాసుగా తోడు దొంగ
సాక్షి, అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. రూ.371 కోట్లు కొల్లగొట్టడంలో చంద్రబాబుకు భాగస్వాములైన నిందితులతో పత్రికా ప్రకటనలు ఇప్పిస్తూ ప్రజలను మోసగించేందుకు యత్నిస్తోంది. తాజాగా డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను టీడీపీ తెరపైకి తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. ‘అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో అవినీతే జరగలేదని, తాము రూ.370 కోట్ల మేర సాఫ్ట్వేర్ సరఫరా చేశామని, చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం’ అని ఆయనతో ఓ వీడియో ప్రకటన విడుదల చేయించింది. కానీ, అసలు వాస్తవం ఏమిటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకోవడంలో డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వినాస్ వినాయక్ ఖన్వేల్కర్‌నే చంద్రబాబు సాధనంగా చేసుకున్నారు. ఈ కుంభకోణంలో వికాస్ వినాయక్ ఖన్వేల్కర్ పాత్రను సీఐడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా నిగ్గు తేల్చాయి. ఒప్పందంలో పేర్కొన్నట్టుగా సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు 90శాతం వాటా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతో సహా రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీకే విడుదల చేశారు. ఆ నిధులను డిజైన్‌టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకు చేర్చింది. ఆ విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారించాకే సీఐడీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేసింది. కొరఢా ఝళిపించిన ఈడీ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో వికాస్ వినాయక్ ఖన్వేల్కర్ ప్రధాన పాత్ర పోషించారని ఈడీ కూడా తేల్చింది. డిజైన్‌టెక్ కంపెనీతో పాటు ఇతర షెల్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. దాంతో మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి వికాస్ ఖన్వేల్కర్‌తోపాటు సీమెన్స్ ఇండియా హెడ్‌గా వ్యవహరించిన సుమన్ బోస్, షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్ల సృష్టికర్తలు, చార్టెడ్ అకౌంటెంట్లు ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను ఈడీ అరెస్టు చేసింది. అంతేకాదు డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను ఈడీ అటాచ్ చేసింది కూడా. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో అంతటి కీలక పాత్ర పోషించిన వికాస్ ఖన్వేల్కర్‌తో అసలు ఆ కుంభకోణమే జరగలేదని టీడీపీ చెప్పించడం విస్మయపరుస్తోంది. ఎందుకంటే ఈ కేసు నిరూపణ అయితే చంద్రబాబు, వికాస్ ఖన్వేల్కర్‌తో పాటు ఇతర నిందితులకు కూడా న్యాయస్థానం కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. అందుకే ఈ కేసును పక్కదారి పట్టించేందుకే ఆయనతో ఇలాంటి అవాస్తవ ప్రకటనలు ఇప్పిస్తోందన్నది సుస్పష్టం. -
పక్కా కుట్రతోనే స్కిల్ దోపిడీ
సాక్షి, అమరావతి : ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కుట్ర పూరితంగా షెల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించి రూ.371 కోట్లను అక్రమంగా తరలించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం.. ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా తరలించడం.. ఇలా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త.. ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’ అని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా 29 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించింది. అవినీతి కుంభకోణాన్ని పూర్తిగా వెలికి తీసి, దోషులను శిక్షించేందుకు సమగ్ర దర్యాప్తు సాఫీగా సాగాలంటే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరింది. ‘గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుతోపాటు ఇతర నిందితులు 38 మంది సహకారంతో చంద్రబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ కీలక పాత్ర పోషించారు’ అని వెల్లడించింది. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే.. దోచేందుకే ప్రాజెక్ట్.. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ను సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌బోస్, డిజైన్ టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్వేల్కర్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఏపీఎస్ఎస్డీసీ, సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీకి డైరెక్టర్‌గా తన సన్నిహిడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300 కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి.. అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు. నిధులు ఇచ్చేయండని చంద్రబాబు ఆదేశం ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10 శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్ ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. లోకేశ్‌దీ కీలక పాత్ర షెల్ కంపెనీల ద్వారా నిధులు ముంబయి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి చేర్చడంలో ఆయన తనయుడు నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. లోకేశ్ తన సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా ఆ నిధుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఫైళ్లు మాయంటీడీపీ హయాంలోనే 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని గుర్తించారు. పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను జప్తు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. నిధులు కొల్లగొట్టేందుకుగ్రీన్ చానల్ ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఎంటర్‌ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.279 కోట్లను యోగేశ్ గుప్తా మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్‌లలోని షెల్ కంపెనీలకు తరలించారు. అనంతరం షెల్ కంపెనీల కమీషన్లు మినహాయించుకుని హవాలా మార్గంలో, బ్యాంకు నుంచి డ్రా చేసి మొత్తం రూ.241 కోట్లను షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి ముంబయిలో అందించారు. ఆ నగదును మనోజ్ పార్థసాని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. ఆయన ఆ రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. కస్టడీలో విచారించాల్సినఅవసరం ఉంది ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం మాస్టర్ మైండ్ చంద్రబాబుకు అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే సిట్ విచారణ కోసం నోటీసులు జారీ చేసిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని విదేశాలకు పరారయ్యారు. మిగిలిన సాక్షులను కూడా చంద్రబాబు బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను అరెస్టు చేశాం. ఆయన బయట ఉంటే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశాలున్నాయి. అందువల్ల ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. -
‘షెల్’ మింగిన ‘స్కిల్’
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోయినా 10 శాతం ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేలా చంద్రబాబే ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు వారించి ఏకంగా నోట్ ఫైళ్లలోనే అభ్యంతరం తెలిపినా బేఖాతర్ చేస్తూ షెల్ కంపెనీలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఆ నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకే చేరిపోయాయి. ఈ మొత్తం అవినీతి బాగోతంలో చంద్రబాబు సర్వం తానై వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నిప్పులా బతికానంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబు అవినీతి వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాల ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. బాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూ పొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చు కున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులిచ్చారు. అంతా బాబు ముఠానే.. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు. తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నో రూల్స్... ‘ఏఐ’.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లు ఎందుకు చెల్లించాలని సునీత లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ముందు ఏదో ఒక జిల్లాలో పైలట్‌గా అమలుచేసి తరువాత నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పీవీ రమేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాక సింగపూర్‌కు ఎలా వెళ్లాయి..? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయనే విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది. చంద్రబాబు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఇప్పటికే సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. కడిగిపారేసిన కాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్( కాగ్) కూడా బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని పేర్కొంది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2018లో ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ► గత ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. ఉప్పందించిన పుణె సామాజిక కార్యకర్త 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. మొదటి ఎఫ్ఐఆర్లో లేనప్పటికీ అందుకే తుది చార్జ్‌షీట్‌లో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సిట్ కేసును పకడ్బందీగా నమోదు చేసింది. చంద్రబాబుతోసహా ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది. -
అవినీతి అనకొండ.. రూ.6 లక్షల కోట్లు!
కష్టపడి, చెమటోడ్చి ఎదగడం ఒక మార్గం.. ఖజానాకు కన్నం వేసి, కుంభకోణాలు చేసి పైకెదగడం మరొక మార్గం. సగటు మనిషి మొదటి మార్గాన్ని ఎంచుకుంటారు. చెమటోడ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. కుంభకోణాలపై కోర్టుల్లో వేసిన కేసుల్లో ‘స్టే’లు తెచ్చుకుని విచారణ నుంచి తప్పించుకుంటూ అక్రమార్జనలో ఆరితేరిపోయారు. రెండెకరాలనుంచి తప్పుడు మార్గాల్లో రూ.6 లక్షల కోట్లకు పడగలెత్తారు. సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను డిజైన్ టెక్ అనే ప్రైవేటు సంస్థకు దోచిపెట్టి.. షెల్ కంపెనీలకు మళ్లించి.. వాటిని తన జేబులో వేసుకున్న చంద్రబాబు బాగోతాన్ని సీఐడీ సిట్ విభాగం గుట్టు రట్టు చేసింది. దీంతో చంద్రబాబును అరెస్టు చేయడంతో రెండెకరాల నుంచి రూ.6 లక్షల కోట్లకు అధిపతిగా ఆయన ఎదిగిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లెకు చెందిన రెండెకరాల రైతు. 1978 ఎన్నికల్లో అక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. తొలి రోజు నుంచే అక్రమార్జనకు తెరతీశారు. ఐదేళ్లూ చంద్రబాబు దోపిడీని కళ్లారా చూసిన చంద్రగిరి ప్రజలు 1983 ఎన్నికల్లో ఓడించి.. సొంత నియోజకవర్గం నుంచి ఆయన్ను తరిమేశారు. ఆ దెబ్బకు భయపడి.. 1989 ఎన్నికల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కుప్పానికి వలస వెళ్లి.. భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్చుకుని.. యథేచ్ఛగా డబ్బులు, మద్యం వెదజల్లుతూ.. రౌడీయిజం చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. నిజ స్వరూపాన్ని చాటిన నేత విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో 600కుపైగా హామీలను ఎర వేసిన చంద్రబాబు అత్తెసరు మెజార్టీతో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. చంద్రన్న కానుక నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ వరకు స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కమీషన్లు ఎలా దండుకోవచ్చో దేశానికి చాటిచెప్పారు. రాజధాని లేని రాష్ట్రానికి దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నిర్మిస్తానంటూ బీరాలు పలికారు. ఆ ముసుగులో రూ.లక్షల కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిలో రైతుల భూములను తక్కువ ధరలకే కాజేశారు. అంతటితో ఊరుకోకుండా వాటిని ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించి రింగ్ రోడ్డును ఆ భూములకు సమీపంలో పోయేలా అలైన్మెంట్ రూపొందించి.. వాటికి ధరలు పెంచుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం ముసుగులో సింగపూర్ కంపెనీలతో కలిపి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్లు కాజేసేందుకు పథకం వేశారు. ఇది చాలదన్నట్టు రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంలోనూ కాంట్రాక్టు సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. వాటి నుంచి రూ.118.98 కోట్లు లంచంగా తీసుకుని ఐటీ శాఖకు అడ్డంగా దొరికపోయారు. కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని.. కమీషన్ల కోసం దాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెప్పడం చంద్రబాబు అవినీతికి పరాకాష్ట. ఏలేరు స్కాంతో సంచలనం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అక్రమార్జనే లక్ష్యంగా పాలన సాగించారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం, కాలువల తవ్వకం కోసం జరిపిన భూసేకరణలో అక్రమాలకు పాల్పడి దేశంలో సంచలనం సృష్టించారు. బంజరు భూముల్లో కొబ్బరి చెట్లున్నట్లు.. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చిత్రీకరిస్తూ ఏలిన వారు ప్రభుత్వ ఖజానాను ఎలా కొల్లగొట్టొచ్చో ఆ కుంభకోణం ద్వారా దేశానికి చాటిచెప్పారు. అదే ఊపులో విద్యుత్ కొనుగోలు, మద్యం కొనుగోలు, డిస్ట్రిబ్యూటరీలకు అనుమతులు ఇలా అన్నింటా అక్రమాలకు పాల్పడ్డారు. ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థకు క్రీడా మైదానాలను నిర్మించే పేరుతో ఖరీదైన భూములు కట్టబెట్టి.. వాటిని కాజేయడానికి పథకం వేయడం.. దాన్ని కప్పి పుచ్చడానికి ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఎల్లో మీడియాతో ప్రచారం చేయించుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. నక్సల్స్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న చంద్రబాబు.. అదే సానుభూతితో గెలిచేందుకు 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ సానుభూతి నాటకాలను ప్రజలు తిప్పికొట్టారు. ఘోరంగా ఓడించడం ద్వారా అవినీతి పాలనకు తెరదించారు. పవన్ కళ్యాణ్కుఅక్కడే 2.40 ఎకరాలు చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. -
బాబూ! ఆ డబ్బెక్కడిది?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆగస్టు 4న చంద్రబాబుకు జారీ చేసిన ఈ షోకాజ్ నోటీసులపై ఆ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం మేరకు వివరాలివీ... మనోజ్ వాసుదేవ్ సోదాల్లో విషయం వెలుగులోకి... మనోజ్ వాసుదేవ్పార్థసాని 2017 నుంచీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ పాల్గొనే టెండర్ల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్నారు. ఆ సంస్థ తరఫున ఈయనే మధ్యవర్తిగా వ్యవహారాలు నడిపేవారు. ఈయనకు చెందిన మనోజ్ పార్థసాని అసోసియేట్స్ కార్యాలయంలో 2019లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాలతో చంద్రబాబు నాయుడు గుట్టుగా సాగించిన అవినీతి బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి భారీ ఎత్తున నగదును తరలించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించారని కూడా గతంలో ఐటీశాఖ తన నివేదికలో వెల్లడించింది. సోదాల సమయంలో కొన్ని మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్స్, ఎక్సెల్ షీట్లను మనోజ్ వాసుదేవ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, అందులో కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల నుంచి నగదును అక్రమంగా తరలించి ‘మీకు చేరుస్తున్నాం’ అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నట్లు ఐటీ శాఖ వివరించింది. ఆ నోటీసుల ప్రకారం మనోజ్ పార్థసాని చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌తో 2016 నుంచీ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాస్ తనను అడిగినట్లు కూడా మనోజ్ వాసుదేవ్ అప్పట్లో వెల్లడించారని ఐటీ పేర్కొంది. అయితే షాపుర్జీ పల్లోంజీ సంస్థ బడా కార్పొరేట్ కంపెనీ కనక... డబ్బును తరలించడానికి వారంతా కలిసి ఓ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవంగా ఎటువంటి పనులు చేయకుండానే షాపూర్జీ పల్లోంజీ నుంచి వివిధ ప్రాజెక్టులు చేసినట్లుగా షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు పెట్టి ఆయా కంపెనీలకు నగదును తరలించారు. ఈ విషయాన్ని 2019 నవంబరు 1న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మనోజ్ పార్థసాని తెలియజేశారు. కేవలం షాపుర్జీ పల్లోంజీయే కాకుండా ఎల్అండ్టీ వంటి ఇన్ఫ్రా కంపెనీల నుంచి ఫోనిక్స్ ఇన్ఫ్రా, పోర్ ట్రేడింగ్ వంటి షెల్ కంపెనీలకు నకిలీ బిల్లుల ఆధారంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖకు అర్థమయింది. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆ డబ్బుకు లెక్కలు చెప్పాలని, అవి ఎలా వచ్చాయో తెలియజేయాలని బాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. శ్రీనివాస్ నుంచి చంద్రబాబు నాయుడుకు నగదు చేరినట్లుగా ధ్రువీకరించే ఆధారాలను, నేరాన్ని ధ్రువపరిచే వివిధ సందేశాలు, చాట్లు, ఇంకా ఎక్సెల్ షీట్లను సైతం సెర్చ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ సాక్ష్యాలను మనోజ్ వాసుదేవ్‌కు చూపించి విచారించగా ఇన్ఫ్రా కంపెనీల నుంచి బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును ఎలా తరలించారన్న విధానాన్ని మొత్తం వివరించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ బోగస్ కంపెనీల ద్వారా తరలించిన నగదు ద్వారా అంతిమంగా లబ్థి పొందింది చంద్రబాబేనని ఐటీ శాఖ పేర్కొంది. మనోజ్ వాసుదేవ్ ద్వారా సబ్‌కాంట్రాక్టుల ద్వారా అందుకున్న రూ.118,98,13,207 మొత్తాన్ని 2020–21లో వచ్చిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. అమిత్ షాను బాబు కలవటంపై అనుమానాలు!! 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడుతూ నానా తంటాలూ పడుతున్న వేళ ఈ నోటీసులు రావటంపై ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కావటాన్ని కూడా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రస్తావించింది. ఈ నోటీసుల విషయమై తాము అటు చంద్రబాబు నాయుడిని, ఇటు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలను ఈ మెయిల్ ద్వారా సంప్రదించామని, ఎవ్వరూ స్పందించలేదని కూడా పత్రిక వెల్లడించింది. లెక్క తేలని మొత్తం రూ.2,000 కోట్లు అమరావతిలో రాజధాని పేరిట తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు... అందులో భారీ కుంభకోణానికి తెగబడినట్లు తాజా ఐటీ నోటీసులతో మరోసారి బట్టబయలైంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో పనుల అంచనా విలువలను భారీగా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేసిన వైనాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. తాత్కాలిక సచివాలయాన్ని రూ.181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ రూ.1,151 కోట్లు ఖర్చు చేశారంటే... అంచనాలు ఎన్ని రెట్లు పెంచారో, అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిగ్గానే అర్థమవుతుంది. 2020, ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.2,000 కోట్ల వరకు లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు బయటకు తీసిన విషయాన్ని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులతో సహా అప్పట్లోనే ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఒకే కంప్యూటర్ నుంచి ఆయా సంస్థలకు చెందిన బిల్లుల చెల్లింపులు, ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. చంద్రబాబు కొండంత అవినీతి చేస్తే మచ్చుకు రూ.2,000 కోట్లు మాత్రమే బయటకు వచ్చాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని భారీ మొత్తాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అడ్డగోలు వాదన... బాబుకు అలవాటే!! చంద్రబాబు నాయుడికైనా, రామోజీరావుకైనా అడ్డంగా వాదించటం పెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్లను ఎవరైనా ‘మీరు ఈ నేరం చేశారా?’ అని అడిగితే... తాము చేస్తే చేశామనో, లేకపోతే చేయలేదనో వీళ్లు నేరుగా చెప్పరు. చేసిన నేరాన్ని తప్పించుకోవటానికి ముందుగా ఎదుటి వ్యక్తికి తమను అడిగే అర్హత లేదనో, లేకపోతే తమకు ఆ చట్టం వర్తించదనో, లేకపోతే ఫలానా చట్టం ప్రకారం తమను ప్రశ్నించజాలరనో ఎదురు తిరుగుతారు. అలా... కేసును దశాబ్దాల పాటు సాగదీస్తారు. పైపెచ్చు తమపై ఎలాంటి కేసులూ రుజువు కాలేదని, తాము శుద్ధపూసలమని చెబుతుంటారు. అసలు విచారణ జరగనిస్తే కదా... వీళ్లు తప్పు చేశారో లేదో తేలటానికి!!. ఇదే రీతిలో ఐటీ శాఖ నోటీసులకు కూడా చంద్రబాబు నాయుడు విచిత్రమైన సమాధానమిచ్చారు. సోదాల్లో చంద్రబాబు నాయుడి పాత్రను బయటపెట్టే ఆధారాలు లభించటంతో... నేరుగా ఆయన ఖాతాల్లోకి ఎంత ముడుపులు వెళ్లాయనే విషయమై ఒక అంచనాకు వచ్చి... అది ఎలా వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు దానికి నేరుగా సమాధానమివ్వకుండా... తనకు నోటీసులిచ్చే అధికారం సదరు సెంట్రల్ సర్కిల్ అధికారికి లేదంటూ జవాబిచ్చారు. దాన్ని పరిశీలించిన ఐటీ శాఖ... సెక్షన్లను ఉటంకిస్తూ సదరు కేసును ఆ అధికార పరిధి ఉన్న డిప్యూటీ కమిషనర్‌కు బదిలీ చేస్తూ... డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీన్ని అక్రమ ఆదాయంగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల్లో ప్రశి్నంచింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్‌కు యూనిసెఫ్ టీమ్ అభినందన -
చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో!
న్యూఢిల్లీ: చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని హుసిస్ కన్సల్టింగ్, బెంగళూరులోని ఫినిన్టీ లిమిటెడ్, గురుగ్రామ్‌లోని జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా కార్యాలయాల్లో సెప్టెంబర్ 8న సోదాలు నిర్వహించిన మీదట ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘జిలియన్ ఇండియా బోర్డులో డోర్సె సభ్యుడిగా ఉన్నారు. చైనాతో లింకులు ఉన్న అసంఖ్యాక డొల్ల కంపెనీలను భారత్‌లో ఏర్పాటు చేయడం, వాటి బోర్డుల్లో డమ్మీ డైరెక్టర్లను చేర్చడం వెనుక తనే మాస్టర్‌మైండ్ అని తేలింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం తను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంత వాస్తవ్యుడిగా డోర్సె నమోదు చేసు కున్నారు. ఢిల్లీ నుంచి బీహార్ రోడ్డుమార్గంలో విదేశాలకు పారిపోయే ప్రయత్నాలకు చెక్ చెప్పిన ఎంసీఏ బీహార్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అరెస్ట్ చేసింది. ఎస్ఎఫ్ఐవో ప్రత్యేక టీమ్ సెప్టెంబర్ 10న డోర్సెను అరెస్టు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపర్చిందని ఎంసీఏ వెల్లడించింది. -
చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విస్తరణ, ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఒకవైపు చైనాపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండగా మరోవైపు చైనా కంపెనీల భారీ హవాలా రాకెట్‌ను ఆదాయ పన్ను శాఖ ఛేదించింది. 1,000 కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న చైనీయులు, ఢిల్లీలోని సంబంధిత భారతీయ వ్యక్తులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీల ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)తెలిపింది. వివిధ బ్యాంకుల్లో 40కి పైగా అకౌంట్ల ద్వారా హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సీబీడీటీ అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు. చైనా అనుబంధ సంస్థల ద్వారా భారత్‌లో రిటైల్ షోరూమ్‌ల బిజినెస్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించిందనీ, నకిలీ కంపెనీలు, స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలను, హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలను కూడా వెలికి తీసినట్టు ఐటీ విభాగం వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారంతో ఈ అక్రమాలకు తెగబడినట్టు పేర్కొంది. -
రూ. 2 వేల కోట్లు: చంద్రబాబుకు ‘లైవ్‌మింట్’ ఫోన్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆదాయ పన్ను శాఖ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసే చంద్రబాబు.. ఐటీ సోదాల్లో రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము బయటపడిన విషయంపై మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఐటీ దాడుల్లో గుర్తించిన రెండువేల కోట్ల అక్రమ లావాదేవీలపై శనివారం కథనం రాసిన లైవ్ మింట్ ఆంగ్ల పత్రిక చంద్రబాబును సంప్రదించినా ఆయన స్పందించలేదు. ఈ విషయాన్ని మింట్ వెబ్సైట్లో ఉన్న కథనంలో చంద్రబాబుకు పలుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ రెండు వేల కోట్లతో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అడిగేందుకు చంద్రబాబు ఫోన్ కోసం ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో ఇదే విషయంపై స్పందన కోరుతూ ఆయనకు ఈ-మెయిల్ పంపినా తిరుగు సమాధానం లేదని కథనంలో పేర్కొన్నారు. దీన్నిబట్టి చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా మీడియాతో మాట్లాడేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. జాతీయ మీడియా అయితే ఇంకా ఆత్రంగా స్పందిస్తారని, కానీ ఐటీ దాడుల నేపథ్యంలో మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని చెబుతున్నారు. (చంద్రబాబు అవినీతి: మచ్చుకు రూ.2,000 కోట్లు) కాగా ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమైనట్లు ఐటీ శాఖ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖుడి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులపై స్పందించాల్సిందిగా లైవ్‌మింట్ ప్రతినిధులు చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తమ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా చంద్రబాబు స్పందించలేదని.. దీంతో టీడీపీకి ఈ- మెయిల్ పెట్టినట్లు తెలిపారు. రూ. 2 వేల కోట్లతో మీకు సంబంధం ఉందా? లేదా అని మెయిల్లో అడిగినట్లు సమాచారం. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు) ఇక ఐటీ దాడులపై చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోయినా.. తమపై బురద జల్లుతున్నారంటూ టీడీపీ ఎల్లో మీడియాలో ప్రెస్మీట్లు పెట్టీ మరీ ఊదరగొట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివరణ కోరిన.. లైవ్‌మింట్ ప్రతినిధులకు మాత్రం వారు సమాధానం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ- మెయిల్‌కు సంబంధించిన లైవ్‌మింట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు అవినీతి బట్టబయలు ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం! ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ పవన్ ఎందుకు నోరు మెదడపడం లేదు? లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) -
రూ. 2 వేల కోట్లు: చంద్రబాబుకు ‘లైవ్‌మింట్’ ఫోన్!
-
నీతి, నిజాయితీకి మారుపేరన్నారుగా?
-
‘ఈ కుంభకోణంలో బాబు హ్యాండ్ ఉంది’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు తమ మెదడును ఉపయోగించి రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లను ఎంచుకుని చేసిన బ్రహ్మాండమైన మోసమని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన దగ్గర పనిచేసిన పీఎస్ శ్రీనివాస్ వద్ద ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరకడం అందరినీ షాక్‌కు గురిచేసిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి సింగపూర్ సింగపూర్ అంటున్న బాబు అక్రమార్జన అంతా సింగపూర్ వెళ్లుంటుందని విమర్శించారు. హవాల ద్వారా పంపిన బ్లాక్‌మనీ.. విదేశీ పెట్టుబడుల రూపంలో మనకు వైట్‌మనీగా వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక టీడీపీ పాలనలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎందుకంటే సదస్సుకు వచ్చిన వారంతా బాబు మనుషులేనని పేర్కొన్నారు. అవన్నీ బాబు షెల్ కంపెనీలే ‘చంద్రబాబు సీఎం కాగానే లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని పలు కంపెనీలు, పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ బాబు షెల్ కంపెనీలే. ఆయన అవినీతి బాగోతం, మనీ లాండరింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. చంద్రబాబు, లోకేష్ దగ్గర ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదు కధా? వారికేం సంబంధం అని చాలామంది అంటారు. కానీ దీనినే బినామీ ట్రాంజాక్షన్ అంటాము. అలాగే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూర్ అని కూడా అనవచ్చు. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత యాజమానిపై ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో తన వద్ద పని చేసిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తం సొమ్ము పట్టుబడిందంటే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూరా? లేదా కుమ్మక్కుతో కూడిన కుంభకోణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు హ్యండ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంటుంది. అందువల్ల ఇది పూర్తిగా బయటపడాలంటే వెంటనే ఐటీ శాఖ శ్రీనివాస్ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించి విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు) చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం! ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) -
నీతి, నిజాయితీకి మారుపేరన్నారుగా?
సాక్షి, గుంటూరు : ‘నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చెప్తారు? ఇంత జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదు? బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి’ అని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిధర్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ బయటకు వచ్చినవి చాలా తక్కువ. ఇంకా పెద్ద కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. కేంద్రం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత ఎంక్వయిరీతో వాస్తవాలు బయటపెట్టాలి. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు’అని అన్నారు. చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! -
బయటపడ్డ రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన!
-
ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల్లో అత్యంత కీలకమైన విషయమేమంటే... ఒక ప్రముఖ వ్యక్తి వద్ద పీఎస్ గా పనిచేసిన వ్యక్తి నుంచి కీలకమైన పత్రాలు అనేక ఆధారాలు లభ్యమైనట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల అనేక చోట్ల పలువురు వ్యక్తులు ఇన్ ఫ్రా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. గడిచిన ఆరు రోజులుగా జరుపుతున్న సోదాల్లో భాగంగా బోగస్ సబ్ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమార్కులు భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ... ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది. (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా రూ. 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది. ఐటీ దాడుల్లో భాగంగా.. లెక్కల్లో చూపని రూ. 85 లక్షల నగదు, రూ. 71 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది. కాగా గత ఆరు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావుకు చెందిన నివాసాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది. -
అవినీతి సొమ్ముతో ఆభరణాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో వెలుగుచూసిన మందుల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దేవికారాణికి చెందిన డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ కంపెనీలు దేవికారాణితో కలసి మం దుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి పేరిట ఉన్నాయి. దీం తో గురువారం అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు దాడులు కొనసాగాయి. తాజా సమాచారంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.కోట్లలో ఆర్జన.. ఈఎస్ఐలో ప్రభుత్వ జీవో 51 ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీ)లకే మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు అవకాశం ఇవ్వాలి. కానీ డైరెక్టర్ హోదాలో ఉన్న దేవికారాణి ఈ లొసుగును ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారన్నది ఏసీబీ అభియోగం. కమీషన్ల కోసం తేజ, ఓమ్ని, మెడీ వంటి కంపెనీల చేత అవసరానికి మించి, అధిక ధరలకు మందులు కొనుగోలు చేయించినట్లు ఏసీబీకి ఆధారాలు దొరుకుతున్నాయి. కాగితాల మీద కంపెనీలు సృష్టించి వాటికి బిల్లులు మంజూరు చేయించుకుని, పంచుకున్నారన్న ఆరోపణలు తాజాగా ఏసీబీ తనిఖీల్లో లభిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేవికారాణికి ఫార్మాసిస్ట్ కొడాలి నాగలక్ష్మి సహకరించింది. నకిలీ కంపెనీలకు భారీగా బిల్లులు మంజూరు చేసి వీరిద్దరూ రూ.కోట్లు గడించారు. దేవికారాణి ఏకంగా రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు కొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడిది? అంత విలువైన ఆభరణాలు ఎలా కొనగలిగారు? అన్న వివరాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. రూ.10 కోట్లు దాటిన అక్రమాలు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల గోల్‌మాల్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలు పోటీపడ్డారు. ఫలితంగా ఈఎస్ఐకి రూ.9.28 కోట్లు నష్టం వాటిల్లింది. తాజాగా 2017–18కి సంబంధించిన 22 ఇండెంట్లలో రెండింటిని విశ్లేషించిన ఏసీబీ అధికారులు రూ.70 లక్షలకుపైగా ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టిందని తేల్చారు. దీంతో ఈ వ్యవహా రంలో వెలుగుచూసిన అవినీతి రూ.10 కోట్లు దాటింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన 16 మంది రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సేకరించిన ఆధారాలతో మరిం త మందిని అరెస్టు చేయనున్నారని సమాచారం. -
డొల్ల కంపెనీలపై హైకోర్టులో నేడు విచారణ
సాక్షి, విజయవాడ: డొల్ల కంపెనీలకు భూ కేటాయింపులపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. అర్హతలేని వివిధ డొల్ల కంపెనీలకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) వేల ఎకరాల భూములను కేటాయించిందని పేర్కొంటూ వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. మాజీ న్యాయాధికారి శ్రావణ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు. -
55 వేల షెల్ కంపెనీలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిపుతున్న డొల్లపై కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. రెండో దఫా ఏరివేతలో భాగంగా 55 వేల షెల్ కంపెనీలను ముసుగు కంపెనీలు) రద్దు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇదే క్రమంలో విచారణలో ఉన్న మరిన్ని కంపెనీలపైనా నిర్ణయం తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పి.పి.చౌదరి వెల్లడించారు. మొదటి విడతలో 2015-17 మధ్య రెండేళ్ల కాలంలో 2.26 లక్షల షెల్ కంపెనీల్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో 55 వేల షెల్ కంపెనీలపై వేటు వేసింది. రెండవ దశలో ఇప్పటికే 55 వేల కంపెనీల నమోదును రద్దు చేశామని, అనేక కంపెనీలు దర్యాప్తులో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లుగా పైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గానీ వార్షిక నివేదికలు గానీ సమర్పించని 2.26 లక్షల కంపెనీలను రద్దు చేశారు. అవి పని చేయని కంపెనీలే కాదు.. ఒకే గదిలో, ఒకే చిరునామాపై అనేక కంపెనీలు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించారు. అలాంటివాటిలో 400 పైగా బోగస్ కంపెనీలు ఉన్నాయని మంత్రి చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డ్రగ్ ఫండింగ్.. ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించిన ప్రభుత్వం.. షెల్ కంపెనీలకు షాకిచ్చింది. ఇందుకోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), ఇతర పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలిపారు. -
ఒకే గదిలో 114 కంపెనీలు..
సాక్షి, హైదరాబాద్ : కంపెనీ అంటే భారీ కార్యాలయం, సిబ్బంది, బోర్డ్ రూమ్ ఇలాంటి హంగామాను ఎవరైనా ఊహించుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఓ మాల్లో కేవలం ఒకే గదిలో ఏకంగా 114 కంపెనీలు తమ కార్యాకలాపాలను సాగించడం విస్మయపరుస్తోంది. ఫార్చూన్ మొనార్క్ మాల్లోని మూడో ఫ్లోర్లో ఓ చిరునామాను వెతుక్కుంటూ వెళ్లిన ఎనిమిది మంది అధికారుల బృందం అక్కడి వ్యవహారం చూసి అవాక్కైంది. 114 కంపెనీలకు ఆ చిన్న గదే చిరునామా అయితే వీటిలో కనీసం 50 కంపెనీలు ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా రూ 8 కోట్ల నుంచి రూ 15 కోట్ల నష్టం చూపుతున్నాయి. ఈ కంపెనీలు కేవలం నగదును కంపెనీల నడుమ సరఫరా చేసేందుకే ఏర్పాటైన షెల్ కంపెనీలుగా భావిస్తున్నారు. ఈ కంపెనీలకు వ్యవసాయ భూముల వంటి ఆస్తులున్నాయని, రిటన్స్ కూడా దాఖలు చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ కంపెనీల డైరెక్టర్లు వేతనాలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కో డైరెక్టర్ 25 నుంచి 30 కంపెనీలను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్‌గా వ్యవహరించరాదని అధికారులు చెబుతున్నారు. కాగా ఒకే చిరునామాపై 25కి మించి కంపెనీలు నడిచే ప్రాంతాలపై నిఘా పెట్టాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే ఈ దాడులు జరిగినట్టు సమాచారం. కాగా ఈ కంపెనీలన్నింటికీ ఎస్ఆర్ఎస్ఆర్ అడ్వైజరీ సర్వీస్ అనే సంస్థే అకౌంటెంట్‌గా వ్యవహరించడం గమనార్హం. -
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
-
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
న్యూఢిల్లీ/ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు పీఎన్బీని రూ. 11,400 కోట్లకు మోసగించిన కేసులో దర్యాప్తు సంస్థలు దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని గుర్తించాయి. భారత్‌తో పాటు విదేశాల్లోని ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నెరపి.. స్థలాలు, బంగారం, విలువైన రాళ్ల రూపంలో బినామీ ఆస్తుల్ని కూడగట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా మోదీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల నగల దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దాదాపు 24 స్థిరాస్తుల్ని గుర్తించి మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఈడీ రూ. 5,674 కోట్ల మేర వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసిన 29 ఆస్తుల విలువను కూడా అంచనా వేస్తున్నాం. త్వరలో మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తాం’ అని ఈడీ తెలిపింది. అందరికీ పర్సంటేజీలు.. మెహుల్ చోక్సీ ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి గ్రూప్ కంపెనీల అనుబంధ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీని ఆదివారం తనిఖీ చేసిన సీబీఐ.. కస్టడీలో ఉన్న పీఎన్బీ ఉద్యోగులు గోకుల్ నాథ్ శెట్టి (రిటైర్డ్), మనోజ్ ఖారత్, నీరవ్ హామీదారు హేమంత్ భట్‌ను ప్రశ్నించింది. విచారణలో శెట్టి, ఖారత్లు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించినట్లు సమాచారం. నీరవ్ , చోక్సీలకు ‘లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్ల జారీ కోసం మంజూరు చేసిన మొత్తానికి అనుగుణంగా పర్సంటేజీలు వసూలు చేసేవారని, కుంభకోణంతో ప్రమేయమున్న అందరు అధికారులకు ఆ మొత్తాన్ని పంచేవారని తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణానికి కేంద్ర బిందువైన ముంబైలోని బ్రాడీ రోడ్డు బ్రాం చ్‌ను సీబీఐ దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సోమవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తుల్ని విచారించిన దర్యాప్తు సంస్థ.. వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించింది. వారిలో పలువురు బ్యాంకు అధికారులుండగా.. ఒకట్రెండు రోజుల్లో వారిని మరోసారి విచారించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు సర్వర్ల నుంచి స్వా«ధీనం చేసుకున్న రికార్డుల్ని అధ్యయనం చేస్తున్నామని, క్విడ్ ప్రో కో కోణంలో కూడా దర్యాప్తు ఉంటుందని.. ప్రస్తుతం దృష్టంతా కేసును పూర్తిగా వెలికితీసి.. నిధులు ఎక్కడికి మళ్లాయో తెలుసుకోవడంపైనే ఉందని సీబీఐ వెల్లడించింది. శ్వేతపత్రం విడుదల చేయాలి: కాంగ్రెస్ దేశంలోని ఆర్థిక మోసగాళ్లతో బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఐదేళ్లలో రూ. 61 వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణాలు చోటుచేసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించిందని, ఆ ఐదేళ్లలో నాలుగేళ్లు ఎన్డీఏనే అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థిక మోసగాళ్లకు, బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలు.. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకొని మోసగించిన సంస్థలు, ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థల యజమానుల వివరాల్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బయటపెట్టేలా కేంద్రం ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న ఎన్పీఏలు(నిరర్ధక ఆస్తులు), బ్యాంకుల్ని మోసగించిన సంస్థల వివరాల్ని వెబ్సైట్లలో ప్రజలకు తెలిసేలా అన్ని బ్యాంకులు ఉంచాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకు మోసాలకు బీజం పడిందంటున్న బీజేపీ గత నాలుగేళ్ల కాలంలో వాటిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల మొత్తం విలువ రూ. 8,36,782 కోట్లు కాగా.. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని, ఎన్‌పీఏల్లో కార్పొరేట్ కంపెనీల వాటా 77 శాతమని తివారీ తెలిపారు. రెండు నిమిషాలు కూడా మాట్లాడలేరా?: రాహుల్ పీఎన్బీ కుంభకోణంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నోరు విప్పాలని, తప్పు చేసిన వారిలా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ‘పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవ్వాలో విద్యార్థులకు ప్రధాని మోదీ రెండు గంటలు పాఠాలు చెప్పారు. అయితే రూ.22 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరు. జైట్లీ దాక్కుంటున్నారు’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. -
ఆ 18 కంపెనీలపై కొరడా
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో డిపాజిట్, విత్‌డ్రాయల్స్ జరిపిన 18 డొల్ల కంపెనీల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని 18 కంపెనీల వివరాలను తీవ్ర ఆర్థిక నేరాల విచారణ సంస్థ (ఎస్ఎఫ్ఐఓ)కు అప్పగించింది. అదేసమయంలో తక్కువ మొత్తం డిపాజిట్లతో వేలాది బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు సాగించిన ఇతర కంపెనీల రికార్డులను స్కాన్ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రాంతీయ డైరెక్టర్లను ఆదేశించింది. రూ 100కోట్ల పైబడిన లావాదేవీలు నిర్వహించిన సంస్థలన్నింటినీ ఎస్ఎప్ఐఓకు నివేదించామని, విచారణల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీల ఇతర చట్టాల ఉల్లంఘనలపై ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలూ విచారణ చేపడతాయని తెలిపాయి.నోట్ల రద్దు సమయంలో డిపాజిట్ చేసిన పాత కరెన్సీ నోట్ల వివరాలను తెలపాలని కంపెనీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోరింది. -
‘జీరో’ ఖాతాల్లో భారీ డిపాజిట్లు
న్యూఢిల్లీ: నల్లధన చలామణికి వీలు కల్పించాయని భావిస్తున్న షెల్ కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారం అందింది. 5.800 షెల్ కంపెనీల జీరో బ్యాలన్స్ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రూ.4,574 కోట్ల వరకూ నగదు జమయిందని, ఆ తరవాత అందులో రూ.4.552 కోట్ల మేర విత్‌డ్రా చేసుకోవడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది. 2,09,032 అనుమానిత కంపెనీలకు సంబంధించి లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటి ఖాతాల్లో నగదు జమలపై 13 బ్యాంకులు కీలకమైన సమాచారాన్ని అందించాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏడాది ఆరంభంలో కంపెనీల రిజిస్ట్రార్ గుర్తింపును కోల్పోయినవే. ఈ తరహా కంపెనీల బ్యాంకు లావాదేవీలపై గత నెలలో కేంద్రం ఆంక్షలు కూడా విధించింది. కాగా, బ్యాంకులు అందించిన సమాచారం ప్రకారం... ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలను కలిగి ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీలకు 900 ఖాతాలు, కొన్నిటికి 300 ఖాతాలు కూడా ఉన్నాయి. గతేడాది పెద్ద నోట్ల రద్దు నాటికి (2016 నవంబర్ 8) ఈ కంపెనీల ఖాతాల్లో (రుణ ఖాతాల మినహా) రూ.22.05 కోట్ల బ్యాలన్స్ ఉంది. నవంబర్ 9న డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నుంచి ఈ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే నాటికి వీటి ఖాతాల్లో రూ.4,573.87 కోట్ల మేర నగదు డిపాజిట్లు అయింది. ఇందులో రూ.4,552 కోట్లను విత్ డ్రా చేసుకున్నారు’’ అని కేంద్రం తన ప్రకటనలో వివరించింది. -
ఆ కంపెనీల అకౌంట్లలో భారీగా డిపాజిట్లు
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం పన్ను ఎగవేతదారులపై, షెల్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా కూడా ఝళిపిస్తోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు షెల్ కంపెనీల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు వెల్లువెత్తినట్టు ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన డేటాలో తెలిసింది. ప్రభుత్వం డేటా ప్రకారం 5,800 షెల్ కంపెనీలను ఈ ఏడాది మొదట్లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల(ఆర్ఓసీ) నుంచి తొలగించారు. ఈ 5,800 కంపెనీలకు 13,140 అకౌంట్లు ఉన్నట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. కొన్ని కంపెనీలకు వందకు పైగా అకౌంట్లు ఉన్నాయని, ఒక కంపెనీ అయితే ఏకంగా 2134 అకౌంట్లను కలిగి ఉన్నట్టు బ్యాంకు డేటా షీటు పేర్కొంది. ఈ డేటా షీటు ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించినప్పుడు, ఈ కంపెనీల్లో బ్యాలెన్స్ రూ.22.05 కోట్లు ఉన్నట్టు తెలిసింది. నవంబర్9 నుంచి అంటే పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రద్దైన కంపెనీల్లో మొత్తం రూ.4,573.87 కోట్లు డిపాజిట్ అయ్యాయని, అంతే మొత్తంలో రూ.4,552 కోట్లు విత్‌డ్రా కూడా అయినట్టు వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దు అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న కొన్ని షెల్ కంపెనీల అకౌంట్లలో భారీ మొత్తంలో డిపాజిట్ అయి, భారీ మొత్తంలో విత్‌డ్రా అయినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. -
విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగులబోతుంది. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆయనపై తాజాగా మరో ఛార్జ్‌షీటు ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,027 కోట్ల రుణాల నుంచి పెద్ద మొత్తంలో నిధులను షెల్ కంపెనీలకు తరలించినట్టు దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు విజయ్ మాల్యాపై ఛార్జ్‌షీటుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి ఏడు దేశాల షెల్ కంపెనీలకు ఈ నిధులను మరలించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే కేసుకు తమ ఈ ఆధారాలు మరింత బలోపేతం చేయనున్నాయని సీబీఐ, ఈడీ చెప్పాయి. తొలుత ఐడీబీఐ బ్యాంకుకు చెందిన రూ.900 కోట్ల రుణాల విషయంలో తొలి ఛార్జ్‌షీటును మాల్యాకు వ్యతిరేకంగా ఏజెన్సీలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైల్ చేయబోతున్న ఛార్జ్‌షీటుతో మాల్యాను మరింత ఉచ్చులో కూరుకుపోనున్నారు. మాల్యాను రప్పించడానికి ఈ ఛార్జ్‌షీటు ఎంతో సహకరిస్తుందని దర్యాప్తు సంస్థలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఆరోపణలపై తాను వివరణ ఇవ్వలేనని, కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నట్టు యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా అన్నారు. రెండో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియలో తామున్నామని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాల్యా, ఆయన అసోసియేట్స్ భారీ మొత్తంలో షెల్ కంపెనీలకు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైనట్టు అధికారులు పేర్కొన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్‌లకు దీనికి సంబంధించి లేఖలు పంపామని, త్వరలోనే పూర్తి వివరాలు తమ చేతులోకి వస్తాయని అధికారులు చెప్పారు. తాజాగా ఫైల్ చేయబోతున్న ఛార్జ్‌షీటును యూకే ప్రాసిక్యూటర్లకు కూడా పంపించనున్నారు. డిసెంబర్లో మాల్యా అప్పగింతపై తుది విచారణ జరుగనుంది. ఈ విచారణ కంటే ముందస్తుగానే ఈ ఛార్జ్‌షీటును యూకేకు పంపించనున్నారు.