![TDP MLA Maddali Giridhar Slams Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/14/MLA-Maddali-Giridhar.jpg.webp?itok=s4AoQdpw)
సాక్షి, గుంటూరు : ‘నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చెప‍్తారు? ఇంత జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదు? బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి’ అని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిధర్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ బయటకు వచ్చినవి చాలా తక్కువ. ఇంకా పెద్ద కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. కేంద్రం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత ఎంక్వయిరీతో వాస్తవాలు బయటపెట్టాలి. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు’అని అన్నారు.
చదవండి:
ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు
‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment